Ayodhya UK Parliament: యూకే పార్లమెంట్‌లో 'అయోధ్య' సంబరాలు.. మార్మోగిన జైశ్రీరామ్‌ నినాదాలు

Ayodhya in UK Parliament : ప్రపంచమంతా హిందూ ప్రజలు అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా రామాలయంపైనే చర్చ జరుగుతుండగా.. విదేశాల్లో కూడా అయోధ్య రామ మందిరంపైన చర్చ జరుగుతోంది. బ్రిటీష్‌ రాజ్యం ఇంగ్లాండ్‌లో కూడా రామ నామస్మరణ మార్మోగుతోంది. యూకే పార్లమెంట్‌ జై శ్రీరామ్‌ నినాదాలతో దద్దరిల్లింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 10:17 PM IST
Ayodhya UK Parliament: యూకే పార్లమెంట్‌లో 'అయోధ్య' సంబరాలు.. మార్మోగిన జైశ్రీరామ్‌ నినాదాలు

Ayodhya Effect on UK: ప్రపంచమంతా అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. శతాబ్దాల కాలం ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం సాకారమవుతుండడంతో ప్రపంచంలోని హిందూ ప్రజలంతా పరమానందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల నుంచి హిందూవులు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి తరలివస్తున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌లో శ్రీరామ నామస్మరణ జరిగింది. అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా యూకేలోని పార్లమెంట్‌ భవనంలో సంబరాలు జరిగాయి.

అక్కడి సనాతన్‌ సంస్థ ఆఫ్‌ యూకే (ఎస్‌ఎస్‌యూకే) ఆధ్వర్యంలో యూకే పార్లమెంట్‌లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కీర్తనలు, భక్తి పాటలు ఆలపించారు. నిండు సభలో జై శ్రీరామ్‌ నినాదాలు చేయడంతో పార్లమెంట్‌ భవనం మొత్తం హిందూ ధార్మికతతో నిండిపోయింది. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. శంఖం ఊదుతూ ఎస్‌ఎస్‌యూకే ప్రతినిధులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా అక్కడి వారికి బొట్టు ధరించి కాషాయ జెండాలు కప్పారు. అనంతరం పార్లమెంట్‌ భవనంలోనే భారత శాస్త్రీయ నృత్యం కళాకారులు ప్రదర్శించారు.

ఎస్‌ఎస్‌యూకే నిర్వాహకులు యుగ్పురుష్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సభలో కక్భూషుండి సంవాద్‌ను ప్రదర్శించారు. అనంతరం భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని చదివి వినిపించి కృష్ణుడి గొప్పతనం కీర్తించారు. అయోధ్యలో ఆలయ ప్రాణప్రతిష్టపై యూకేలోని 200 ఆలయాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఓ పత్రంపై సంతకాలు చేసి బ్రిటన్‌ పార్లమెంట్‌కు సమర్పించాయి. యూకేలోని ధార్మిక సంస్థలు ఇచ్చిన ప్రకటనను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు యూకే ప్రతినిధులు అందించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి దేశం నుంచి పలువురు ప్రతినిధులు అయోధ్యలో జరిగే వేడుకకు వస్తున్నారని సమాచారం.

Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News