Bill Gates Covid 19: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం!

Bill Gates Tests Positive For Covid 19. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 12:20 PM IST
  • బిల్‌ గేట్స్‌కు కరోనా
  • ఐసోలేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం!
  • పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు
Bill Gates Covid 19: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం!

Bill Gates Tests Positive For Covid 19: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంగళవారం తనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు ఐసోలేషన్‌లోనే ఉంటానని బిల్‌ గేట్స్‌ ట్వీట్‌ చేశారు. 

'నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం నాకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు ఐసోలేషన్‌లోనే ఉంటాను. వైద్యుల సలహాలను పాటిస్తున్నా. నేను పూర్తి స్థాయిలో కరోనా టీకాలు తీసుకున్నా. గొప్ప వైద్య సంరక్షణ కలిగి ఉండటం నా అదృష్టం.గేట్స్ ఫౌండేషన్ కృషికి కృతజ్ఞతలు. ఆ టీమ్‌లో నేను ఉండటం నా అదృష్టం' అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ వరుస ట్వీట్స్ చేశారు. 

 
సీటెల్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్ ఫౌండేషన్. దీని ఎండోమెంట్ సుమారు $65 బిలియన్లు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఎంతో కృషి చేసింది. పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేసింది. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్‌ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు 120 మిలియన్ల డాలర్లను బిల్‌ గేట్స్‌ విరాళంగా ఇచ్చారు.

 

Also Read: Guru Gochar 2022: గురుగ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు శుభకాలం!

Also Read: Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News