Mikhail Gorbachev: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత...

Mikhail Gorbachev Death:మిఖాయిల్ గోర్బచేవ్ 1985-1991 వరకు సోవియెట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1990-1991 వరకు సోవియెట్ యూనియన్ అధినేతగా ఉన్నారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 31, 2022, 09:03 AM IST
  • మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత
  • ఒకప్పటి సోవియెట్ యూనియన్‌కు గోర్బచేవ్ చివరి అధినేత
  • 91 ఏళ్ల వయసులో గోర్బచేవ్ మరణం
Mikhail Gorbachev: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత...

Mikhail Gorbachev Death: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ (91) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రష్యా సెంట్రల్ క్లినికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గోర్బచేవ్ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తెరలేచిన అమెరికా-సోవియెట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధానికి శాంతియుతంగా ముగింపు పలకడంలో గోర్బచేవ్ కీలకంగా వ్యవహరించారు. సోవియెట్ యూనియన్‌లో నిరంకుశత్వానికి తెరదించి ఆ వ్యవస్థను ప్రజాస్వామికీకరించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ఈ సంస్కరణలు కమ్యూనిస్ట్ పార్టీని బలహీనపరిచాయనే విమర్శలున్నాయి.

మిఖాయిల్ గోర్బచేవ్ 1985-1991 వరకు సోవియెట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1990-1991 వరకు సోవియెట్ యూనియన్ అధినేతగా ఉన్నారు. మొదట్లో మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు కట్టుబడిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో సోషల్ డెమోక్రసీ సిద్ధాంతాన్ని అనుసరించారు. 1991లో సోవియెట్ యూనియన్ పతనం తర్వాత గోర్బచేవ్ రాజకీయ జీవితం కూడా ముగిసింది. 1996లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. 

తూర్పు-పశ్చిమ దేశాల మధ్య సత్సంబంధాల కోసం గోర్బచేవ్ చేసిన కృషికి గాను 1990లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. గోర్బచేవ్ మృతి పట్ల ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. గోర్బచేవ్ చిత్తశుద్ధిని, ధైర్యాన్ని తాను అభిమానిస్తానని యూకె ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్ దుందుడుకు చర్యలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో సోవియెట్ యూనియన్ నేతగా అప్పట్లో గోర్బచేవ్ వ్యవహరించిన తీరును గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: Ganesh Chaturthi 2022: గణేశ్ చతుర్థి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా ? అశుభమా ?

Also Read: Horoscope Today August 31st 2022: వినాయక చవితి స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News