Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం

Muktinath Project Works: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పనుల్లో కదలిక వచ్చింది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2023, 11:10 AM IST
Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం

Muktinath Project Works: నేపాల్‌లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద నయాపూల్/బీరేతాటి-ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పుంజుకుంది. నేపాల్‌లో చైనా తన స్థావరాన్ని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నేపాల్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. భారత్‌-నేపాల్ మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలకు కొత్త పుంతలు తొక్కే ఈ ప్రాజెక్ట్ వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ భారీ ప్రాజెక్టును అత్యున్నత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు రెండు దేశాల ప్రముఖ కంపెనీలైన హైదరాబాద్‌కు చెందిన ముక్తినాథ్ కేబుల్‌కార్ ప్రైవేట్ లిమిటెడ్, K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ కార్ ప్రాజెక్ట్ కావడం విశేషం. కాగా.. ఈ ప్రాజెక్ట్‌కు 2022లో నేపాల్‌కు రూ.15 బిలియన్ల సాయం అందించనున్నట్లు చైనా కూడా ప్రకటించడం గమనార్హం. 

నయాపూల్/బీరేతాటి-ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్. దీని కోసం భారత్‌-నేపాల్ కంపెనీల మధ్య ఈ ఒప్పందానికి, పెట్టుబడికి నేపాల్ ప్రభుత్వ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ఆమోదించింది. ముక్తినాథ్ కేబుల్‌కార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ సప్కోటా, EPCF తరపున K&R రైల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఛైర్మన్ KP కల్రా అధికారికంగా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎంఓయూ నిబంధనల ప్రకారం.. ప్రాజెక్ట్ కోసం ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) అలాగే నాన్-కన్వర్టబుల్ కరెన్సీలో ప్రాజెక్ట్ రుణాన్ని అందించడానికి K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అంగీకరించింది.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) అధ్యయనం, పర్యావరణ ప్రభావ అంచనా (EIA) కూడా చివరి దశలో ఉన్నాయి. ముక్తినాథ్ దర్శన్ ప్రై. లిమిటెడ్ ప్రాజెక్ట్ కోసం అవసరమైన 90 శాతం భూమిని సేకరించింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.55 బిలియన్లు. ఈపీసీఎఫ్ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ అండ్ ఫైనాన్సింగ్) స్ట్రక్చర్ ద్వారా అవసరమైన లోన్ ఏర్పాట్లు జరగనుండగా.. దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. దాని ఖర్చులో 2 శాతం రిజర్వ్‌డ్ షేర్ల ద్వారా ప్రభావిత రంగాలు భరిస్తాయి. 7 శాతం షేర్లు సాధారణ వడ్డీకి అందుబాటులో ఉంటాయి. మిగిలిన 11 శాతం ప్రమోటర్ షేర్‌లుగా పేర్కొంటారు.

కేబుల్ కార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన తేదీ నుంచి గరిష్టంగా 48 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం మిగిలిన పరిపాలనా, చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా, K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ సమగ్ర ఒప్పందాన్ని ఖరారు చేస్తోంది.

ఎందుకు ఈ భారీ ప్రాజెక్ట్..?

ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులకు కేబుల్ కార్ బ్రిడ్జి తప్పనిసరి. ఈ ఆలయం ద్జోంగ్ ఖోలా లోయ పైభాగంలో ఉంది. ఈ జొంగ్‌ఖోలా లోయ ముక్తినాథ్ లోయ పేరుతో ప్రాముఖ్యత పొందింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పర్యాటకులు ద్జోంగ్‌ఖోలా మరియు కాళీ గండకి నది మధ్య మంచుతో కప్పిన శిఖరాలను చూసే అవకాశం లభిస్తుంది. దానికి ఆనుకుని ముందు నుంచి చూస్తే చెట్లు లేని రాళ్లు పొరలుగా ఏర్పడి వాటి మధ్య పొదలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ మరికొన్ని చోట్ల అక్కడక్కడా గడ్డి, ముళ్ల వృక్షాలు కనిపిస్తాయి.
 
భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు

నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన డేటా ప్రకారం.. 2023 సంవత్సరంలో అత్యధికంగా నేపాల్‌కు వెళ్లిన పర్యాటకులు భారత్‌ నుంచి ఉన్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6,14,148 మంది విదేశీ పర్యాటకులు దేశానికి వచ్చారు. ఇందులో 2,09,105 మంది పర్యాటకులు భారతీయులు కాగా.. 77,009 మంది పర్యాటకులతో అమెరికా రెండో స్థానంలో, 44,781 మంది పర్యాటకులతో బ్రిటన్ మూడో స్థానంలో నిలిచాయి. ఆస్ట్రేలియా 26,874 మంది పర్యాటకులతో నాలుగో స్థానంలో, బంగ్లాదేశ్ 25,384 మందితో 5వ స్థానంలో నిలిచాయి. 

Also Read: Solar Lunar Eclipse 2023: ఈ రాశులవారిపై 2 గ్రహాణాల ఎఫెక్ట్‌..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..

Also Read: Five state Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు మరో 2 రోజుల్లో నోటిఫికేషన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News