చైనాపై మరో వైరస్ బాంబ్

కరోనా వైరస్‌తో గజగజలాడుతున్న చైనా నెత్తిన మరో పిడుగు పడింది. చైనాలో మరో వైరస్‌ను గుర్తించారు. చైనాలోని హునన్ ప్రావిన్స్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. 

Last Updated : Feb 2, 2020, 02:13 PM IST
చైనాపై మరో వైరస్ బాంబ్

కరోనా వైరస్‌తో గజగజలాడుతున్న చైనా నెత్తిన మరో పిడుగు పడింది. చైనాలో మరో వైరస్‌ను గుర్తించారు. చైనాలోని హునన్ ప్రావిన్స్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. అంతలోనే చైనాలో మరో భయంకరమైన వైరస్ ఉన్నట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. హునన్ ప్రావిన్స్ లో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే హెచ్ 1ఎన్ 1 వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీన్ని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్‌ను గుర్తించే క్రమంలో బర్డ్ ఫ్లూ వైరస్ గురించి తెలుసుకున్నట్లుగా చైనా మీడియాలో కథనాలు వస్తున్నాయి. చైనాలోని షయోయాంగ్ పట్టణంలోని కోళ్ల ఫారాలలో ఈ వైరస్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హెచ్ 1ఎన్ 1 వైరస్ కారణంగా వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. గతంలోనూ బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమైన హెచ్ 1ఎన్ 1 వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే పూర్తిగా నశించిందనుకున్న ఈ వైరస్ . .  మళ్లీ తాజాగా ప్రత్యక్షం కావడంతో వణుకు మొదలైంది. కరోనా వైరస్‌తో ఇబ్బంది ఎదుర్కుంటున్న చైనాలోనే ఇది ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు గజగజా వణుకుతున్నారు. ఐతే  దీన్ని ఎదుర్కునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. 

మరోవైపు ఈ  బర్డ్ ఫ్లూ కలిగించే హెచ్ 1ఎన్ 1 వైరస్ అదృష్టవశాత్తూ మనుషులకు వ్యాపించలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడ్డ కోళ్లను నాశనం చేస్తున్నారు. కోళ్ల ఫారాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

Trending News