ఇమ్రాన్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త మరియు తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఈ రోజు పాకిస్తాన్ ఎన్నికల సంఘం, కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

Last Updated : Oct 12, 2017, 06:32 PM IST
ఇమ్రాన్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త మరియు తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఈ రోజు పాకిస్తాన్ ఎన్నికల సంఘం, కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.  గత చాలా కాలంగా కేసు నడుస్తున్నప్పటికీ, కోర్టు  ఆదేశాలను భేఖాతరు చేస్తూ,  ఇమ్రాన్ ఖాన్ అసలు న్యాయస్థానానికి హాజరు కాలేదని.. ఇప్పటి వరకు ఈ విషయంలో  రాతపూర్వక క్షమాపణ కూడా అందించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇమ్రాన్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబరు 26వ తేదీన కోర్టులో జరగనున్న విచారణకు ఇమ్రాన్ హాజరు కావాలని  అతన్ని ఆదేశించింది. ఇమ్రాన్ హాజరు కాని యెడల, పోలీసులు రంగంలోకి దిగి అతన్ని బలవంతంగా కోర్టు ముందు హాజరు పరచాలని తెలిపింది. ఈ విషయంపై ఇంకా ఇమ్రాన్ ఖాన్ స్పందించాల్సి ఉంది.   ఎన్నికల సంఘం పలు అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఇమ్రాన్ ఆరోపణలు చేశారు. ఆ కేసులో భాగంగానే ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో విచారణ నడుస్తోంది.

Trending News