Russia Ukraine War: యుద్దానికి తాత్కాలిక విరామం.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా...

Russia Uraine War: ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించింది రష్యా. పౌరుల తరలింపు ప్రక్రియకు వీలుగా కాల్పులను విరమిస్తున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 02:22 PM IST
  • రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్‌డేట్స్
  • కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
  • పౌరుల తరలింపుకు హ్యుమనిటేరియన్ కారిడార్
Russia Ukraine War: యుద్దానికి తాత్కాలిక విరామం.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా...

Russia Uraine War: దాదాపు గత 10 రోజులుగా ఉక్రెయిన్‌పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని మరియుపోల్, వోల్నోవాఖా నగరాల నుంచి పౌరుల తరలింపుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శనివారం ఉదయం ప్రకటన చేసినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ న్యూస్ వెల్లడించింది.

'ఇవాళ మార్చి 5.. మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 10గంటలు..  రష్యా వైపు నుంచి తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. మరియుపోల్, వోల్నోవాఖా నగరాల నుంచి పౌరుల తరలింపు ప్రక్రియకు వీలుగా హ్యుమనిటేరియన్ కారిడార్‌ను ఏర్పరుస్తున్నాం.' అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

బెలారస్ వేదికగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన రెండో విడత చర్చల్లో హ్యుమనిటేరియన్ కారిడార్‌కు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ గురువారమే (మార్చి 5) ట్వీట్ చేశారు. హ్యుమనిటేరియన్ కారిడార్‌కు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం మరియుపోల్ నుంచి 2 లక్షల మంది, వోల్నోవాఖా 20 వేల మంది పౌరులను తరలిస్తున్నారు. ఈ రెండు నగరాలు ప్రస్తుతం ఉక్రెయిన్ వేర్పాటువాదుల దిగ్బంధంలో ఉన్నాయి. 

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇప్పటివరకూ 1,60,000 మంది నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి శరణార్థి ఏజెన్సీ ప్రకటించింది. చాలామంది శరణార్థులు పోలాండ్, హంగేరీ, మాల్దొవా తదితర పొరుగు దేశాలకు పారిపోయారని తెలిపింది. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇవాళ్టితో పదో రోజుకు చేరింది. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో ఉక్రెయిన్-రష్యా మధ్య మూడో దఫా చర్చలు జరగవచ్చునని కీవ్ వర్గాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని.. ఆయన సమయం ఖరారు చేయగానే చర్చలు అధికారికంగా ఖరారవుతాయని తెలిపాయి.

Also Read: Gold Smuggling: అరికాళ్ల కింద బంగారం.. కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News