Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!

Russian Model Murdered: ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్న క్రమంలో ఓ రష్యన్ మోడల్ మృతదేహం అక్కడ లభించింది. గ్రేటా వెడ్లర్ అనే రష్యా మోడల్ మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కనుగొన్నారు. అయితే ఈమె గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విమర్శలు చేయడమే ఆమె మృతికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 01:01 PM IST
    • ఉక్రెయిన్ లో రష్యన్ మోడల్ గ్రేటా వెడ్లర్ మృతదేహం లభ్యం
    • సూట్ కేసులో మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు
    • గతంలో పుతిన్ పై విమర్శలు చేయడమే ఆమె హత్యకు కారణమంటున్న ప్రతివాదులు!
Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!

Russian Model Murdered: ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఇప్పుడు మరింత తీవ్రతరం చేసింది రష్యా. ఈ క్రమంలో రష్యాకు చెందిన గ్రేటా వెడ్లర్ అనే మోడల్ మృతదేహం ఉక్రెయిన్ లో లభించింది. అది కూడా ఓ సూట్ కేసులో ఆ మోడల్ మృతదేహం లభ్యమైంది. అయితే ఈ మోడల్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఏడాది క్రితం విమర్శలు చేసింది. పుతిన్ ఓ పిచ్చివాడని గ్రేటా వెడ్లర్ గతంలో విమర్శలు చేయగా.. ఆమె ఇప్పుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈమెను హత్య చేయించి ఉండొచ్చనే వాదనలు కూడా జరుగుతున్నాయి. 

ప్రియుడే హత్య చేశాడు!

23 ఏళ్ల ఈ రష్యన్ మోడల్ పేరు గ్రేటా వెడ్లర్. పుతిన్‌ను 'సైకో పాత్ (పిచ్చి వాడు)' అంటూ సోషల్ మీడియాలో గతేడాది పోస్ట్ చేసింది. కొరోవిన్ అనే 23 ఏళ్ల యువకుడితో గ్రేటా కొన్ని నెలల క్రితం బ్రేకప్ చెప్పేసింది. అయితే ఇప్పుడా మోడల్ ను డబ్బు వ్యవహారంలో గొంతు కోసి చంపినట్లు కొరోవిన్ ఒప్పుకున్నాడు. అయితే ఇది రాజకీయ హత్య కాదని.. పుతిన్ కు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని గ్రేటా వెడ్లర్ మాజీ ప్రియుడు చెప్పడం గమనార్హం. 

అయితే గ్రేటా వెడ్లర్ ను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో ఉంచి.. మూడు రోజుల పాటు ఓ హోటల్ లో ఉన్నట్లు కొరోవిన్ పేర్కొన్నాడు. ఆమె మృతి చెంది ఏడాది గడుస్తున్నా.. ఆమె బ్రతికే ఉందని స్నేహితులను నమ్మించే విధంగా గ్రేటాకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలను నిందితుడు పోస్ట్ చేశాడు. కానీ, ఈ విషయాన్ని గ్రేటా స్నేహితులలో ఒకరికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత మాస్కోలో తన స్నేహితురాలు మిస్ అయ్యిందని వారు కేసు పెట్టారు. ఈ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గ్రేటా వెడ్లర్ మృతదేహాన్ని కనుగొన్నారు. కొరోవిన్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చి చెప్పారు.  

Also Read: Barak Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా

Also Read: Russia Ukraine War: పోలాండ్‌ సరిహద్దులో రష్యా భీకర దాడులు... 35 మంది మృతి, 134 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News