Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో.. తంగరాజును ఉరితీసిన సింగపూర్‌

Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి బుధవారం ఉరశిక్ష అమలు చేసింది సింగపూర్ ప్రభుత్వం. దీనిపై వరల్డ్ వైడ్ గా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్ అతడిని శిక్షించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2023, 01:12 PM IST
Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో.. తంగరాజును ఉరితీసిన సింగపూర్‌

Drug Trafficking in Singapore: మాదకద్రవ్యాలు అక్రమ రవాణా కేసులో 46 ఏళ్ల భారతీయ సంతతి వ్యక్తిని సింగపూర్ బుధవారం ఉరితీసింది. దీనిపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చినప్పటికి సింగపూర్ అతడికి శిక్షను అమలు చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.

భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య డ్రగ్స్ దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టయ్యాడు. సింగపూర్ నుండి ఒక కిలో గంజాయిని అక్రమంగా రవాణా చేశాడనే ఆరోపణలపై 9 అక్టోబర్ 2018న అతనికి మరణశిక్ష విధించబడింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు ఈ డ్రగ్స్ రవాణాకు సహకరించినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. తనకు డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధం లేదని తంగరాజు కోర్టులో వాదించాడు. అయితే ఆ విషయాన్ని న్యాయస్థానంలో నిరూపించ లేకపోయాడు. తంగరాజు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డాడని.. దానికి సంబంధించిన ఆధారం అతని ఫోనేనని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. 

Also Read: Kenya Deaths: భయానక ఘటన.. జీసస్‌ను కలిసేందుకు ఆకలితో అలమటించి 47 మంది ఆత్మహత్య..!

కోర్టు నిర్ణయంపై తలెత్తిన ప్రశ్నలు
తంగరాజు సూపయ్య ఉరిశిక్షకు ముందు కోర్టు తీర్పుపై అంతర్జాతీయంగా ప్రశ్నలు తలెత్తాయి. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తన బ్లాగ్‌లోని ఒకదానిలో అతన్ని ఎందుకు ఉరితీయాలని ప్రశ్నించారు. అంతేకాకుండా సింగపూర్ ఒక అమాయకుడిని ఉరితీయబోతోందని రాసుకొచ్చారు. బ్రాన్సన్ చేసిన ఈ ప్రకటనను సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు సింగపూర్‌ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. మాదక ద్రవ్యాలకు సంబంధించి లోకల్ చట్టాల ప్రకారమే అతడికి ఉరిశిక్ష అమలు చేస్తున్నామని సింగపూర్‌ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 

Also Read: Burkina Faso: మిలటరీ దుస్తుల్లో వచ్చి.. 60 మందిని చంపేశారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News