Earth Quake: జపాన్ లో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు

జపాన్ లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5 గా నమోదవడంతో అప్రమత్తమయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ, ఆస్థినష్టం సంభవించలేదని తెలుస్తోంది.

Last Updated : Sep 4, 2020, 04:23 PM IST
Earth Quake: జపాన్ లో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు

జపాన్ లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ ( Richter scale ) పై తీవ్రత 5 గా నమోదవడంతో అప్రమత్తమయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ, ఆస్థినష్టం సంభవించలేదని తెలుస్తోంది.

తరచూ భూకంపాలకు లోనయ్యే జపాన్ ( Japan ) దేశంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. జపాన్ లోని రీహోకు జిల్లాలో ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పుకుయ్ ప్రిఫెక్చర్ ప్రాంతంలో ప్రకంపనలు ( Tremors in japan ) వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 5.0గా నమోదైంది. అదృష్టవశాత్తూ ఎక్కడా ఆస్థి, ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత తక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపం సంభవించిన ప్రాంతానికి ఉత్తరాన 36.1 డిగ్రీల అక్షాంశం, 136.2 డిగ్రీల రేఖాంశం మధ్యన పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో మళ్లీ ప్రకంపనలు వచ్చేఅవకాశాలున్నాయని తెలుస్తోంది. Also read: Bloomberg Index: ప్రపంచ సంపన్న మహిళ ఆమెనే

Trending News