Volodymyr Zelensky: లొకేషన్​తో సహా ఎక్కడున్నాడో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు!

Volodymyr Zelensky: రష్యాకు బయపడి దేశం విడిచి పారిపోయాడని, బంకర్​లో దాక్కున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్​స్కీ. ఈ మేరకు తాను ఎక్కడ ఉంటున్నానో చూపిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియోను షేర్​ చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 01:57 PM IST
  • ఉక్రెయిన్​లోనే ఉన్నానన్న ఆ దేశ అధ్యక్షుడు
  • దేశం విడిచి వెళ్లాడన్న వార్తల నేపథ్యంలో క్లారిటీ
  • ఇన్​స్టాగ్రామ్​లో లొకేషన్​ షేర్​ చేసిన జెలన్​స్కీ
Volodymyr Zelensky: లొకేషన్​తో సహా ఎక్కడున్నాడో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు!

Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుద్ధం కొనసాగుతునే ఉంది. ఉక్రెయిన్​లోని వివిధ నగరాలపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. రాజధాని నగరం కీవ్​ సహా వివిధ ప్రాంతాలపై రష్యా బాంబు దాడులు చేస్తూ.. ఉక్రెయిన్​ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉక్రెయిన్​ కూడా సమర్థంగా రష్యాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. బాంబులు పడుతున్నా తమ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే రష్యా దాడులకు బయపడి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలన్​స్కీ  బంకర్​లో దాక్కున్నాడని.. దేశం విడిచి పారిపోయాడని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తున్నారు జలన్​స్కీ. తాజాగా తాను ఎక్కడికి పారిపోలేదంటూ.. బంకర్​లో లేనంటూ.. చెబుతూ ఓ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. తాను ఉంటున్న లొకేషన్​ కూడా షేర్ చేశారు.

రాజధాని కీవ్​లో అధికారిక కారక్యాలయంలో ఉన్నానంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.

'నేను ఎక్కడా దాక్కోలేదు. బాంకోవా స్ట్రీట్​లో అధికారిక ఆఫీస్​లో ఉన్నాను. నేను ఎవరికి బయపడటం లేదు. దేశం యుద్ధంలో గెలిచేందుకు అవసరమైనంతా చేస్తాం.' అని రాసుకొచ్చారు జెలన్​స్కీ.

యుద్ధ భయాలు..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్​లో చాలా మంది ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగ.. మరికొంత మంది తుపాకులు చేతపట్టి రష్యాపై పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాను కట్టడి చేసేందుకు ఐరోపా దేశాలు, అమెరికా కఠన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికీ రష్యా మాత్రం యుద్ధం కొనసాగుతుందని చెబుతోంది.

Also read: Russia Ukraine War Pics: యుద్ధంతో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి..శాటిలైట్ చిత్రాలు

Also read: Indian in Ukraine Army: యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారత విద్యార్థి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News