రాత్రి తినే ఫుడ్స్ విషయంలో అప్రమత్తత

రాత్రి వేళ సరైన ఆహారం తినడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే కొన్ని రకాల పదార్ధాలు జీర్ణక్రియను అస్తవ్యస్థం చేసి నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

';

స్పైసీ ఫుడ్స్

రెడ్ చిల్లీస్, మసాలా పదార్ధాలు వంటి స్పైసీ ఫుడ్స్ గుండెలో మంట కల్గిస్తాయి. అజీర్ణానికి కారణమౌతాయి. ఇందులో ఉండే కారం కారణంగా కడుపులో యాసిడ్ సమస్య రావచ్చు.

';

ఫ్రైడ్ స్నాక్స్

సమోసా, పకోడీ వంటి ఫ్రైడ్ పదార్ధాలను రాత్రి వేళ తినకూడదు. ఇందులో ఫ్యాట్, గ్రీస్ అధికంగా ఉంటాయి. ఇందులో వాడే నూనె కారణంగా జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రాత్రి అసౌకర్యంగా ఉండి నిద్రను పాడు చేస్తాయి.

';

హెవీ మీట్ డిషెస్

కబాబ్, బటర్ చికెన్ వంటి నాన్ వెజ్ ఫుడ్స్ రాత్రి వేళ త్వరగా జీర్ణం కావు. ఇందులో ఉండే హై ప్రోటీన్లు, ఫ్యాట్ కారణంగా అజీర్తి సమస్య ఉత్పన్నమౌతుంది.

';

షుగర్ పదార్ధాలు

గులాబ్ జామున్, జిలేబి వంటి హై షుగర్ స్వీట్స్ రాత్రి వేళ తినకూడదు. దీనివల్ల జీర్ణం సరిగ్గా జరగక నిద్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అసౌకర్యంగా ఉంటుంది.

';

కెఫీనేటెడ్ బెవెరేజెస్

టీ, కాఫీ, కోలా వంటివి కెఫీన్ అధికంగా ఉండే బెవరేజెస్ తాగకూడదు. వీటి వల్ల రాత్రి వేళ నిద్ర సరిగ్గా పట్టదు. రాత్రంతా తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది.

';

ప్రోసెస్డ్ ఫుడ్స్

ఇన్‌స్టంట్ నూడిల్స్ , రెడీ టు ఈట్ మీల్స్ వంటివాటిలో సోడియం ఇతర ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. దాంతో డీ హైడ్రేషన్, బ్లోటింగ్ కు కారణమౌతాయి. నిద్రలేమికి దారితీస్తుంది.

';

సిట్రస్ ఫ్రూట్స్

ఆరెంజ్, లెమన్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ రాత్రి వేళ తినడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య రావచ్చు. తీవ్రంగా అసౌకర్యం ఉంటుంది. ఇది కాస్తా గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమౌతుంది.

';

పాల ఉత్పత్తులు

పన్నీరు, క్రీమీ పదార్ధాలు రాత్రి వేళ తినకూడదు. బ్లోటింగ్, కడుపులో నొప్పి వంటి సమస్యలు రావచ్చు.

';

కార్బోహైడ్రేట్ ఫుడ్స్

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బ్రెడ్, పేస్ట్రీ వంటివి తినకూడదు. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి. నిద్రకు ఆటంకం కల్గిస్తాయి. రాత్రంతా అసౌకర్యంగా ఉంటుంది

';

ఆల్కహాల్

సాయంత్రం వేళ మద్యం తాగకూడదు. దీనిల్ల నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రంతా మంచి నిద్ర పట్టినా మరుసటి రోజు తీవ్ర అలసటగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story