బ్రేకింగ్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు.. 30 మంది మహిళల ప్రాణాలు కాపాడిన స్థానికులు

హిందూపురం కొట్నూరు చెరువు వద్ద రహదారిపై నీటి ప్రవాహం అధికంగా అందటం.. బస్సు డ్రైవర్ అలాగే వెళ్ళటం.. బస్సు చిక్కుకొని పోవటం.. స్థానికులు బస్సలో ఉన్నవారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 10:47 AM IST
  • హిందూపురం నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు
  • బస్సులో 30 మంది మహిళలు మరియు డ్రైవర్
  • అందరిని కాపాడిన స్థానికులు.. తప్పిన పెను ప్రమాదం
బ్రేకింగ్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు.. 30 మంది మహిళల ప్రాణాలు కాపాడిన స్థానికులు

30 Women Passengers Safe from the Bus: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలో వరదల వల్ల రాష్ట్రం అతలాకుతలం అయింది. అనంతరపురం (Ananthapuram), నెల్లూరు (Nellore), చిత్తరు (Chitturu), కడప (Kadapa) జిల్లాల్లో భారీ వర్షాలు భీభత్సవాన్ని సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు 29 మంది మృతి చెందగా.. 17 మంది గల్లంతయ్యారు.    

భారీ వర్షం కారణంగా.. చెరువులకు గండ్లు పడగా.. గ్రామాల్లోకి వరద నీరు చేరటంతో దాదాపు 13 వందలకు పైగా గ్రామాలు నీట మునిగాయి.. దాదాపు 6 లక్షల యాభై వేళా ఎకరాల పంట నష్టం జరిగినట్టు అంచనా.. ఇదిలా ఉండగా.. అనంతపురం జిల్లాలో భారీ వర్షల కారణంగా చాలా నష్టం జరిగింది. 

Also Read: ఈడెన్ గార్డెన్స్ లో చెలరేగిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్

హిందూపురం (Hindupuram) కొట్నూరు చెరువు వద్ద రహదారిపై నీటి ప్రవాహం తీవ్రంగా ఉంది. అయినప్పటికీ.. 30 మంది మహిళలతో ఉన్న తూముకుంట (Tumukunta) గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు..  డ్రైవర్ నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయగా.. నీటి ప్రవాహంలో బస్సు ఇరుక్కుపోయింది. 

బస్సులో ఉన్న 30 మంది మహిళలు కూడా చిక్కుకొనిపోగా... సమయానికి స్థానికులు వారిని కాపాడారు. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది. భారీ నీటి ప్రవాహాలు ఉన్నపుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు మరియు ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో 2జాగ్రత్తగా ఉండకపోతే.. వారి ప్రాణాలతో పాటు వాహనాల్లో ఉన్న వారి ప్రాణాలకు హాని కలగవచ్చని సూచిస్తున్నారు. స్థానికుల సమాయంతో బయటపడటంతో 30 మంది మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News