AP: మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. 

Last Updated : Aug 5, 2020, 09:27 AM IST
AP: మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

Covid-19: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా ఏపీ ( Andhra Pradesh ) రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( balineni srinivas reddy ) కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల నుంచి స్వల్ప జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొదట ఆయనకు నెగిటివ్ రాగా.. మంగళవారం బాలినేనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. Also read: Sushant Case: నాకు సంబంధం లేదు: ఆదిత్య థాక్రే

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు వెంకటేశ్‌కు కూడా కరోనా సోకింది. బలరాం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. అయన కుమారుడు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. Also raed: మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత

Trending News