బీజేపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ప్రశంసల వర్షం

బీజేపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.

Last Updated : Sep 6, 2018, 08:42 PM IST
బీజేపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ప్రశంసల వర్షం

బీజేపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా పైడికొండల మాణిక్యాలరావు, విష్ణుకుమారరాజులు తమ ప్రసంగాల్లో నియోజకవర్గాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అయితే కేంద్రం నుండి మరిన్ని నిధులు రప్పించుకోవాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలపై కూడా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే రోజు రోజుకూ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా తయారవుతున్నాయని.. వాటిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

పేదవారికి, మధ్యతరగతి వారికి మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించడానికే తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. వైద్యసంబంధిత సేవలను అందివ్వడంలో ప్రభుత్వ వైద్యులు బాధ్యతాయుతంగా ఉండాలని.. ఈ విషయంలో వారు అశ్రద్ధ వహిస్తే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సరైన వైద్యాన్ని అందించాల్సిన కనీస కర్తవ్యం వైద్యుల మీద ఉంటుందని ఆయన తెలిపారు. 

అయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే వైద్యసదుపాయాలను సక్రమంగా అందిస్తున్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుందని చంద్రబాబు అన్నారు. అయితే కేంద్రం కూడా ఈ విషయంలో సహకరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కూడా ఔట్ సోర్సింగ్ పద్ధతులను ఉపయోగించి అదనంగా సేవలను అందివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించడమే అందరి లక్ష్యం కావాలన్నారు.

Trending News