Ys Jagan Delhi Tour: ఢిల్లీలో జగన్ బిజీ.. కేంద్ర మంత్రులతో విస్తృత భేటీ

Ys Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్‌లతో చర్చించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2022, 02:00 PM IST
Ys Jagan Delhi Tour: ఢిల్లీలో జగన్ బిజీ.. కేంద్ర మంత్రులతో విస్తృత భేటీ

Ys Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్‌లతో చర్చించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటన విస్తృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో (Anurag Thakur) ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రంలోని విద్య, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్డేడియంల అభివృద్ది గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. అటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో (Dharmendra Pradhan) కూడా భేటీ ముగిసింది. 

మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) ముగిసింది. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పలు రోడ్లపై చర్చ సాగింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల మంజూరుకై ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ నేషనల్ హైవే కోసం డీపీఆర్ అభివృద్ధిపై చర్చించారు.

విశాఖపట్నం నగరానికి ఈ హైవే చాలా ఉపయోగమని..విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్ వెళ్లే రవాణా వాహనాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సముద్రతీరానికి ఆనుకుని బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ రోడ్డు అత్యంత ఉపయోగకరమన్నారు. విశాఖ నగరంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకై 6 లైన్ల రహదారి కావాలని వైఎస్ జగన్ కోరారు. 

Also read: Sankranthi Special Buses: ఏపీ, తెలంగాణల్లో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News