Sankranthi Special Buses: ఏపీ, తెలంగాణల్లో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi Special Buses: తెలుగింట సంక్రాంతి శోభకు మరికొద్దిరోజులు మిగిలుంది. పెద్ద పండుగకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2022, 10:30 AM IST
Sankranthi Special Buses: ఏపీ, తెలంగాణల్లో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi Special Buses: తెలుగింట సంక్రాంతి శోభకు మరికొద్దిరోజులు మిగిలుంది. పెద్ద పండుగకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి మరో వారం రోజుల్లో ఉంది. మరో నాలుగు రోజుల్లో సెలవుల సందడి ప్రారంభమవుతూనే అందరూ సొంతూర్లకు పయనమవుతారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంది. సంక్రాంతి సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

ఏపీఎస్సార్టీసీ ప్రత్యేకంగా 6 వేల 970 బస్సుల్ని నడపనుంది. ఇందులో సంక్రాంతికి ముందుగా 4 వేల 145 బస్సులు, పండుగ అనంతరం 2 వేల 825 బస్సులు తిరగనున్నాయి. జనవరి 8 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు (Sankranthi Special Buses) ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి.స్పెషల్ బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాలకు కూడా 15 వందల బస్సుల్ని ఏపీఎస్సార్టీసీ (APSRTC) నడపనుంది. 

ఇక టీఎస్సార్టీసీ (TSRTC) కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్ధం 4 వేల 360 బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అదిలాబాద్, ఖమ్మం , భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు..కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కలగనుంది. అయితే టీఎస్సార్టీసీ మాత్రం ఏ విధమైన అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు. 

Also read: Omicron Variant: ఏపీలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News