Tadipatriలో 500 పడకల COVID-19 Hospital ప్రారంభించిన ఏపీ సీఎం YS Jagan

AP CM YS Jagan Mohan Reddy :  కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా తాడిపత్రిలో నిర్మించిన 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రి (Tadipatri COVID-19 hospital)ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 4, 2021, 02:49 PM IST
  • కరోనా సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏపీ సీఎం
  • మరోవైపు కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేస్తున్న ఏపీ సర్కార్
  • తాడిపత్రిలో కోవిడ్-19 ఆసుప్రత్రి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
Tadipatriలో 500 పడకల COVID-19 Hospital ప్రారంభించిన ఏపీ సీఎం YS Jagan

Tadipatri COVID-19 Hospital: కరోనా సమయంలోనూ ఓవైపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే, మరోవైపు మెరుగైన పరిపాలనకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా టీకాలు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివిటీ రేటు ఏపీలో తగ్గుతోంది.

ఏపీ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా తాడిపత్రిలో నిర్మించిన 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagam Mohan Reddy) ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు చేసిన 500 ఆక్సిజన్‌ పడకల ఆస్పత్రిని తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం నాడు వర్చువల్‌గా ప్రారభించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో 13.56 ఎకరాల్లో ఈ కోవిడ్19 ఆసుపత్రిని నిర్మించారు. దీనికి రూ. రూ.5.5 కోట్లు ఏపీ సర్కార్ వెచ్చించింది.

Also Read: Anandaiah Medicine: బుక్ చేస్తే చాలు..ఇంటికే ఆనందయ్య కరోనా మందు

తాడిపత్రిలో నిర్మించిన ఈ కోవిడ్19 ఆసుపత్రి (Tadipatri COVID-19 Hospital) ప్రారంభానికి వర్షపు నీళ్లతో నిండిపోయింది. గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఆస్పత్రి ప్రాంగణం జలమయం అయింది. నేడు ఆసుపత్రి ప్రారంభోత్సవం నేపథ్యంలో మోటార్ల సాయంతో వర్షపు నీటిని బయటకు పంపారు. మరోసారి ఇలా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Also Read: Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News