Anandaiah Medicine: బుక్ చేస్తే చాలు..ఇంటికే ఆనందయ్య కరోనా మందు

Anandaiah Medicine: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కృష్ణపట్నం ఆనందయ్య మందు మరో నాలుగు రోజుల్లో అందుబాటులో రానుంది. ఆనందయ్య మందు కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదిక. మీ ఇంటికే ఆ మందు చేరనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2021, 12:21 PM IST
 Anandaiah Medicine: బుక్ చేస్తే చాలు..ఇంటికే ఆనందయ్య కరోనా మందు

Anandaiah Medicine: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కృష్ణపట్నం ఆనందయ్య మందు మరో నాలుగు రోజుల్లో అందుబాటులో రానుంది. ఆనందయ్య మందు కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదిక. మీ ఇంటికే ఆ మందు చేరనుంది.

ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం కరోనా మందు (Krishnapatnam Corona Medicine) విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మందు పంపిణీకు ప్రభుత్వం (Ap government) అనుమతిచ్చిన తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మందు తయారీ, పంపిణీకు ఆనందయ్య సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వ సూచనల మేరకు ఆనందయ్య మందు తయారీ కేంద్రం మారింది. సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీకు తయారీ కేంద్రాన్ని మార్చారు. మందు తయారీకు కావల్సిన ముడి సరుకులు, వంట సామగ్రిని సీవీఆర్ అకాడమీకు తరలించారు. కృష్ణపట్నంలో ప్రజలు భారీగా వచ్చే అవకాశమున్నందున తయారీ కేంద్రాన్ని మార్చినట్టు అధికారులు తెలిపారు. 

మందు తయారీ సమయంలో భద్రత వంటి విషయాల్ని సహకార అందించాలని..మూలికలు, ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని ఆనందయ్య కోరారు. ఆనందయ్య మందు తయారీకు అవసరమైన తేనెను గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి సరఫరా చేయిస్తామని నెల్లూరు కలెక్టర్ తెలిపారు.

ఆనందయ్య మందు ( Anandaiah Medicine) పంపిణీలో కీలకమైన మార్పు చేశారు. ఇవాళ్టి నుంచి childeal.in వెబ్‌సైట్ అందుబాటులో వచ్చే అవకాశముంది. వెబ్‌సైట్‌లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీకు ఏర్పాట్లు చేసినట్టు ఆనందయ్య బృందం తెలిపింది. మరో నాలుగైదు రోజుల్లో మందు అందుబాటులో రానుందని తెలుస్తోంది. 

Also read: Maganti Babu’s son Maganti Ravindra found dead: మాగంటి రవీంద్ర మృతి వెనుక భిన్న వాదనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News