హోమ్ క్వారంటైన్‌పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌కు రోడ్డు మార్గాన ఇతర రాష్ట్రాల నుంచి రావాలనుకునేవారు తప్పనిసరిగా స్పందన పోర్టల్ ద్వాారా ఈ పాస్ తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.

Last Updated : Jun 1, 2020, 09:56 AM IST
హోమ్ క్వారంటైన్‌పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ

నేటి నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్5.0 నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్‌కు రావాలనుకునే ప్రయాణీకులు ఖచ్చితంగా స్పందన (Spandana) పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని, ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. 

నేటి (జూన్ 1) నుంచి కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు తాజా నిబంధనల ప్రకారం హోమ్ క్వారంటైన్ (Home Quarantine)లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులు 7 రోజులు ఇన్‌స్టిస్టూషనల్ క్వారంటైన్‌ (ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్)లో ఉండలన్నారు. అనంతరం కోవిడ్19 టెస్ట్ చేయిస్తామని, కరోనా పాజిటివ్ వచ్చిన వారిని కోవిడ్ హాస్పిటల్‌కు, నెగటివ్ వచ్చినవారిని మరో వారం రోజులపాటు హోమ్ క్వారంటైన్‌కు పంపిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.    LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

కాగా, దేశ వ్యాప్తంగా నేటి నుంచి లాక్‌డౌన్5.0 అమలులోకి వస్తుంది. దీంతో లాక్‌డౌన్ నిబంధనలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త మార్పులు చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వీలైతే బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున పోలీసులు, అధికారులకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని, ఆందోళన అక్కర్లేదని ఏపీ డీజీపీ సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

 

Trending News