Ap High Court: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌‌పై హైకోర్టులో కీలక పరిణామాలు

Ap High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారమై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ అవసరం లేదని ఎన్నికల కమీషనర్ నివేదించింది. తదుపరి విచారణ మార్చ్ 1వ తేదీకు వాయిదా పడింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2021, 11:27 AM IST
  • జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో హైకోర్టులో కీలక పరిణామాలు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో తాజా నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టుకు నివేదించిన ఎన్నికల సంఘం
  • విచారణను మార్చ్ 1వ తేదీకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
Ap High Court: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌‌పై హైకోర్టులో కీలక పరిణామాలు

Ap High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారమై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ అవసరం లేదని ఎన్నికల కమీషనర్ నివేదించింది. తదుపరి విచారణ మార్చ్ 1వ తేదీకు వాయిదా పడింది.

ఏపీ హైకోర్టు ( Ap High Court)లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2020లో ప్రారంభమై నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని..తాజా నోటిఫికేషన్ ( Notification)వెలువరించేలా ఆదేశించాలంటూ జనసేన తరపున ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఎన్నికల కమీషనర్ తరపు వాదన జరిగింది. జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల ( Zptc, Mptc Elections)కు తాజా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగానే ఈనెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు  ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్ మనుగడలో ఉన్నప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని..ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత ప్రశ్నించేందుకు వీలు లేదని..పిటీషన్‌కు విచారణ అర్హత లేదని చెప్పారు.

ఇప్పటికే ఈ అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని..వాటితో కలిపి విచారించాలని ఎన్నిక సంఘం ( Election commission) హైకోర్టును కోరింది. దీనికి సమ్మతించిన కోర్టు ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాల్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చ్ 1వ తేదీకు వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు ( Ap panchayat elections) ముగిసినందున..ఇంటింటికీ రేషన్ విషయంలో పెండింగ్‌లో ఉన్న అప్పీల్‌పై తదుపరి విచారణ అవసరమా లేదా అనేది ఎన్నికల కమీషనర్‌ ( Ap Sec )తో మాట్లాడి చెబుతామని చెప్పారు. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. 

Also read: BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికల్ని బహిష్కరించిన బీజేపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News