YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు

YS Sharmila Comments On CM Jagan: వైఎస్ వివేకా హత్య కేసుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న అని పిలిపించుకున్నవాడే హంతకులకు అండగా ఉంటున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 15, 2024, 02:03 PM IST
YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు

YS Sharmila Comments On CM Jagan: వైఎస్ వివేకా ఒక మంచి మనిషి అని.. ఆయనది అద్భుతమైన వ్యక్తిత్వమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. చిన్నాన్న ఎప్పుడు చికాకు పడలేదని.. కోపం రాదన్నారు. సహాయం అని అడిగితే వెంట పెట్టుకొని మరి తీసుకొని వెళ్లేవారని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో షర్మిలా మాట్లాడుతూ.. చిన్నాన్న తనను ఎంపీగా పోటీ చేయమని కోరాడని, పోటీ కోసం తనను ఒప్పించి మరీ వెళ్లారని అన్నారు. ఆ రోజే తాను చివరిసారి కలిశానని గుర్తు చేసుకున్నారు. చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లు గడించిందని.. ఇప్పటికీ చిన్నాన్న మరణం నమ్మలేని నిజం అని అన్నారు. రాజకీయ విష సర్పాల కోరల్లో చిక్కుకుని.. దుర్మార్గపు పాలన చక్రాల కింద నలిగి న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పులాంటి నిజం అని పేర్కొన్నారు.

Also Read: Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్‌పై పోటీ..?

"క్రూరాతి క్రూరంగా హత్య చేశారు. దారుణంగా నరికి చంపారు. వివేకా సమాజంలో పెద్ద మనిషి. వైఎస్సార్‌కు ప్రియమైన తమ్ముడు. అలాంటి వ్యక్తి హత్య విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఈనాటికీ శిక్ష పడలేదు. అంతటి వ్యక్తికే న్యాయం జరగలేదు అంటే.. సమాజంలో మిగతా వారి పరిస్థితి ఏంటి..? చిన్నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారు అని చెప్పారు. హత్య ఎవరు చేశారో అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు అన్ని విషయాలు తెలుసు. బంధువులే హత్య చేశారు అని అందరికీ తెలుసు. ఎవరు చేశారో అందరికీ తెలుసు. వేలు ఎత్తి వీళ్ళే అని చూపుతున్నా చర్యలు లేవు. కేసు ముందడుగు పడలేదు. అన్న అని పిలిపించుకున్న వాడే హంతులకు రక్షణగా ఉన్నాడు. అందుకే ఇవ్వాళ్టి వరకు చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదు.

వివేకా హత్యతో సునీత, చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఇద్దరికీ నష్టం జరిగింది. న్యాయం చేయాల్సింది పోయి సునీత హత్య చేసింది అని చెప్తున్నారు. మీరు ఒకసారి అద్దం ముందు నిలబడండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుంది చూడండి. చనిపోయే వరకు మీకే సేవ చేశారు. మీకోసమే ఎన్నికలో పని చేశారు. మీ కోసం పని చేస్తే నిందలు వేస్తారా..? సోషల్ మీడియాలో బెదిరించారు. బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెల్లు అని చూడకుండా అవమానాలకు గురి చేశారు. అన్నింటికీ తట్టుకున్నాం. న్యాయం కోసం సునీత తిరగని చోటు లేదు.. తట్టని గడప లేదు. సునీత కుటుంబం హత్య చేసి ఉంటే.. మీరు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? 

హత్య ఎవరు చేశారో మీకు తెలుసు. అందుకే మీకు ధైర్యం రాదు. సునీతను చూసిన ప్రతి సారి నా గుండెల్లో అంతులేని బాధ గుర్తుకు వస్తుంది. అంతే స్థాయిలో ఉద్రేకం.. న్యాయం జరగలేదు అని. సునీతకు.. చిన్నమ్మ కి మాట ఇస్తున్న
ఎవరు ఉన్నా లేకున్నా...వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉంది. సునీత పోరాటానికి నేను బలం అవుతా. హాంతులకు శిక్ష పడాలని చేస్తున్న ధర్మ పోరాటంలో నేను ఒక ఆయుధం అవుతా. నేను ఈ మట్టిమేదే పుట్టా.. ప్రజలు అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలను ఛీ కొట్టాలి.. హంతకుల పక్షాన నిలబడుతున్న వారికి ఒక గుణపాఠం కావాలి." అని వైఎస్ షర్మిల మాట్లాడారు.

Also Read:  Oppo A78 Price Cut: అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌ ధరకే కొత్త Oppo A78 మొబైల్‌ను పొందండి.. పరిమితకాల ఆఫర్‌..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News