Ys Viveka Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..పులివెందులలో సీబీఐ మకాం అందుకేనా..!

Ys Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్‌ కేసులో సీబీఐ విచారణ ఎలా జరుగుతోంది..?ఈకేసు విచారణ మళ్లీ మొదటికొచ్చిందా..? సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఇళ్ల కొలతలు దేని కోసం..? అసలు సూత్రధారులు ఎవరన్నది అధికారులు తేల్చుతారా..?

Written by - Alla Swamy | Last Updated : Jun 8, 2022, 12:32 PM IST
  • మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు
  • విచారణ వేగవంతం చేసిన సీబీఐ
  • పులివెందులలో కీలక విచారణ
Ys Viveka Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..పులివెందులలో సీబీఐ మకాం అందుకేనా..!

Ys Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న దస్తగిరి, ఇనయతుల్లా ఇచ్చిన వాంగ్మూలంగా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వివేకా ఇంటితోపాటు నిందితుల ఇళ్ల కొలతలు తీసుకుంటున్నారు. దీంతో కేసు సంచలనంగా మారింది. మళ్లీ కేసును మొదటి నుంచి తవ్వుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

గంతకొంతకాలంగా పులివెందులలో సీబీఐ అధికారులు మకాం వేశారు. పట్టణం మొత్తం గాలిస్తున్నారు. వైఎస్ వివేకా ఇంటితోపాటు నిందితుల ఇళ్లను పరిశీలిస్తున్నారు. వైఎస్ వివేకా వ్యక్తిగత సహాయకుడు ఇనయతుల్లాతోపాటు రెవెన్యూ, సర్వేయర్లతో మంతనాలు జరిపారు. ఎప్పుడు సీఎం జగన్‌ ఇంటి వైపు వెళ్లని అధికారులు..తొలిసారి ఆయన నివాసానికి వెళ్లారు. ఇంటి కొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్, వివేకా సన్నిహితుడు ఎర్ర గంగి రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇళ్లను పరిశీలించారు.

వైఎస్ వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనాస్థలిలో రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దర్యాప్తులో భాగంగా వివిధ ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ తీశారు. చాలా చోట్ల ఫోటోలు కూడా తీసినట్లు తెలుస్తోంది. అసలు హత్య ఎలా జరిగింది..? నిందితులు ఎలా వచ్చారు..? హత్య అనంతరం నిందితులు ఎటువైపు వెళ్లారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

వివేకా వ్యక్తిగత సహాయకుడు ఇనయతుల్లాను వెంటపెట్టుకుని..దర్యాప్తులో వేగం పెంచారు. హత్య జరిగిన రోజు, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌లో ఫోటోలు, వీడియోలు తీసిన సమయంలో ఇనయతుల్లా అక్కడ ఉండటంతో..ఆ కోణంలో కేసులో స్పీడ్‌ పెంచారు. ఈకేసులో అసలు సూత్రధారులు ఎవరన్న దాని చుట్టూ విచారణ జరుగుతోంది. అందుకు అవసరమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఏ౩ దస్తగిరి ఇచ్చిన సమాచారంపై కూడా ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Also read: Fourth wave Scare: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు... కొత్త కేసులు ఎన్నంటే?

Also read:Minor Rape Victims: రెచ్చిపోతున్న కామాంధులు..బాలికలపై ఆగని దారుణాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News