Minor Rape Victims: రెచ్చిపోతున్న కామాంధులు..బాలికలపై ఆగని దారుణాలు..!

Minor Rape Victims: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. రోజుకో చోట అఘాయిత్యాలు బయటపడుతున్నాయి. మైనర్‌ బాలికలకు మాయమాటలు చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 8, 2022, 10:04 AM IST
  • రెచ్చిపోతున్న మానవ మృగాలు
  • వరుసగా వెలుగుచూస్తున్న దారుణాలు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Minor Rape Victims: రెచ్చిపోతున్న కామాంధులు..బాలికలపై ఆగని దారుణాలు..!

Minor Rape Victims: హైదరాబాద్‌లో దారుణ ఘటనలు మరవకముందే నిజామాబాద్‌ జిల్లాలో మరో ఘోరం వెలుగుచూసింది. దాగుడు మూతల పేరుతో మైనర్ బాలికను దగ్గరైన ఓ యువకుడు..ఆమె నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. వాటిని చూపి బెదిరిస్తూ లైంగిక దాడి చేసేవాడు.  ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇంకొకడు అదే బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను ఫోన్లో తీసి..రాక్షస ఆనందం పొందాడు.

వేధింపులు తాళలేక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిజామాబాద్‌ నాలుగో పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులతో కలిసి బాలిక జీవిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న యువకుడు రోహిత్..బాలికను దగ్గరైయ్యాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దాగుడు మూతల ఆట పేరుతో అపార్ట్‌మెంట్ పైఅంతస్తుకు తీసుకెళ్లేవాడు.

ఈక్రమంలో మూడేళ్ల క్రితం బాలిక న్యూడ్ చిత్రాలను ఫోన్‌లో తీశాడు. వాటిని చూపించి బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం అవే చిత్రాలను చూపిస్తూ ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి అఘ్యాయిత్యానికి పాల్పడ్డాడు.ఈఏడాది ఏప్రిల్‌లోనూ మరోసారి లైంగిక దాడికి దిగాడు. ప్రేమ పేరుతో అదే బాలికకు భాను ప్రసాద్ గౌడ్ అనే యువకుడు దగ్గరైయ్యాడు. మాయ మాటలు చెప్పి ఓ కళ్యాణ మండపం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.

దీనిని ఫోన్‌లో బంధించాడు. వాటిని బాలికను పంపుతూ బెదిరింపులకు దిగాడు. తనతోపాటు బయటకు రాకపోతే వైరల్‌ చేస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. తన సోదరి వివాహం ఉండటంతో వీటిని మనసులో పెట్టుకున్న బాధితురాలు..ఆ కార్యక్రమం పూర్తికాగానే ఇద్దరి వేధింపుల గురించి తల్లిదండ్రులకు వివరించింది. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఖాకీలు నిందితులపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు..ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ అనే యువకుడు ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మరో యువకుడు భానుప్రసాద్ గల్ఫ్‌కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్‌ ఘటన మరవకముందే నారాయణపేట జిల్లా కోయిలకొండలోనూ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Also read: Mahesh Vijay Combo: క్రేజీ కాంబినేషన్.. ఒకే స్క్రీన్‌పై సూపర్ స్టార్స్ మహేష్ బాబు, విజయ్..?

Also read:Hyper Adi Arrest: కమెడియన్ హైపర్ ఆది అరెస్ట్..? షో మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలేం జరిగింది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News