Chaddi gang : అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డ చెడ్డీగ్యాంగ్‌.. భయాందోళనలో విజయవాడవాసులు

Chaddi gang in Vijayawada: గుంటుపల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లోకి చెడ్డీగ్యాంగ్‌కి చెందిన ఒక ఐదుగురు సభ్యుల ముఠా చొరబడింది. ఇది అంతా అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల దోపిడీలకు పాల్పడ్డ చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన ముఠానే తాజాగా గుంటుపల్లిలో చోరీకి ప్రయత్నించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 01:34 PM IST
  • విజయవాడ శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంకు సమీపంలోని గుంటుపల్లిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్‌
  • అర్ధరాత్రి సమయంలో గుంటుపల్లి గ్రామంలో ఒక అపార్ట్‌మెంట్‌లో
    దోపిడీకి విఫలయత్నం
  • అపార్ట్‌మెంట్‌లో లైట్లు వేయటంతో చెడ్డీ గ్యాంగ్‌ పరారు
Chaddi gang : అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డ చెడ్డీగ్యాంగ్‌.. భయాందోళనలో విజయవాడవాసులు



Chaddi gang strikes in Guntupalli near Ibrahimpatnam Vijayawada city: విజయవాడ శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంకు సమీపంలోని గుంటుపల్లిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్‌ చేసింది. అర్ధరాత్రి సమయంలో గుంటుపల్లి (Guntupalli) గ్రామంలో ఒక అపార్ట్‌మెంట్‌లోకి (Apartment‌) చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు లైట్లు వేయటంతో చెడ్డీ గ్యాంగ్‌ (Chaddi gang) పరారైంది. 

గుంటుపల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లోకి చెడ్డీగ్యాంగ్‌కి (Chaddi gang) చెందిన ఒక ఐదుగురు సభ్యుల ముఠా చొరబడింది. అర్ధరాత్రి సమయంలో కర్రలతో పాటు మారణాయుధాలతో ఈ చెడ్డీ గ్యాంగ్‌ ఎంట్రీ ఇచ్చింది. నక్కినక్కి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడడం.. అంతా కూడా అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డ్‌ అయ్యింది. శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌ యజమాని వెంటనే లైట్లు వేశారు. దీంతో చెడ్డీ గ్యాంగ్ ముఠా అక్కడి నుంచి పరారయ్యింది.

Also Read : Mother, Child suicide : ఎంత కష్టమొచ్చిందో.. 9 నెలల కుమార్తెను నడుముకు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి

గతంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల దోపిడీలకు పాల్పడ్డ చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన ముఠానే తాజాగా గుంటుపల్లిలో చోరీకి ప్రయత్నించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చెడ్డీగ్యాంగ్ సంచరిస్తుందనే సమాచారం రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సీసీ టీవీ ఫుటేజీ (CCTV footage) ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీగ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు (Police) గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.



 

Also Read : Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్​- ప్రభాస్​, పూజాల జోడీ అదిరిందిగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News