Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్​- ప్రభాస్​, పూజాల జోడీ అదిరిందిగా..

Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ సినిమా నుంచి లవ్ అంథెమ్ ఫుల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో ప్రభాస్​-పూజా జంట మూవీ లవర్స్​ను ఫిధా చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 11:37 AM IST
Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్​- ప్రభాస్​, పూజాల జోడీ అదిరిందిగా..

Radhe Shyam Love Anthem: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్​గా నటించిన 'రాధేశ్యామ్​' కొత్త కొత్త అప్​డేట్స్​ ఇస్తూ ఫ్యాన్స్​లో ఉత్సాహం పెంచుతోంది. నేడు లవ్ అంథెమ్​ ఫుల్ సాంగ్ రిలీజ్​ అయ్యింది.

ఇప్పటికే ఇదే సాంగ్​ హిందీలో విడుదలైంది. ఈ సాంగ్​లో ప్రభాస్​, పూజా హెగ్జేల జోడి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది కూడా.

తెలుగులో నగుమోము తారలె అంటూ సాగే ఈ సాంగ్​లో.. ప్రభాస్​- పూజాల జోడి మధ్య రోమామ్స్​ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తమిళం, మళయాళం, కన్నడాలో కూడా నేడే ఈ సాంగ్​ రిలీజ్ అయ్యింది. మాస్​ హీరోగా ప్రభాస్​ దూసుకుపోతున్న ప్రభాస్​ ఈ పాటలో లవర్​ బాయ్​గా సరికొత్తగా కనిపించారు.

రాధేశ్యామ్ సినిమా గురించి..

వచ్చే ఏడాది జనవరి 14న ఈ రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్​-పూజా హెగ్జేల జోడీకి ఇది తొలి సినిమా కావడం విశేషం. మరోవైపు సాహో తర్వాత ప్రభాస్​ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

యూవీ క్రియేషన్స్​ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తుండగా.. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్​ దర్శకత్వం వహించారు. 

తెలుగు పాటలకు జస్టిన్ ప్రభాకరన్​​ సంగీతం అందించగా.. హీందీ వెర్షన్​కు మిథూన్​, అమాల్​ మాలిక్​, మనన్ భరద్వాజ్​ సంగీతం అందించారు.

Also read: Bangarraju Song Teaser: ‘బంగార్రాజు’ సినిమా నుంచి ‘నా కోసం’ సాంగ్ టీజర్ రిలీజ్

Also read: Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News