Bail Conditions: బెయిల్ మంజూరు చేస్తూ చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు ఇవే

Bail Conditions: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది. ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2023, 12:32 PM IST
Bail Conditions: బెయిల్ మంజూరు చేస్తూ చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు ఇవే

Bail Conditions: 52 వారాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి లభించిన బిగ్ రిలీఫ్ ఇది. ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు ఆయనకు 4 వారాల మద్యంతర బెయిల్ మంజూరు చేయడమే కాకుండా కొన్ని షరతులు విధించింది. ఆ షరతులకు లోబడి ఉండాల్సిందిగా సూచించింది. ఆ షరతులేంటో తెలుసుకుందాం..

ఏపీ స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 52 రోజులుగా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో మద్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ముఖ్యంగా కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు నిన్న తీర్పు రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించింది. చంద్రబాబు కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ అవసరాన్ని గుర్తించిన హైకోర్టు చంద్రబాబుకు 4 వారాలపాటు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు కోర్టులో లొంగిపోవల్సి ఉంటుంది

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో తెలిపింది. నిందితుడైనా, క్రిమినల్ అయినా లేదా అమాయకుడైనా సరే ఆరోగ్య పరీక్షలు పొందడం అవసరమని కోర్టు తెలిపింది. ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యమైంది, విలువైంది మనిషి ప్రాణమని స్పష్టం చేసింది. మెరుగైన ఆరోగ్యం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఈ హక్కును ఎవరూ ఎవర్నించీ లాక్కోలేరని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేస్తున్నామని తెలిపింది.

బెయిల్ షరతులు

1. ఇద్దరు వ్యక్తుల స్యూరిటీతో లక్ష రూపాయలబెయిల్ బాండ్ సమర్పించాలి.
2. పిటీషనర్ అంటే చంద్రబాబు తన సొంత ఖర్చుతో తనకు నచ్చిన చోట చికిత్స చేయించుకోవచ్చు. 
3. నాలుగువారాల గడువు పూర్తయిన తరువాత పిటీషనర్ అంటే చంద్రబాబు తిరిగి కోర్టులో లొంగిపోయినప్పుడు..చికిత్స వివరాలు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనే వివరాల్ని సీల్డ్ కవర్‌లో జైలు సూపరింటెండెంట్ ద్వారా ఏసీబీ కోర్టుకు సమర్పించాలి.
4. ఈ కేసుకు సంబంధించిన లేదా కేసు గురించి తెలిసినవారికి లేదా ఎవరితోనూ పిటీషనర్ మాట్లాడటం గానీ లేదా బెదిరించడం గానీ లేదా హామీ ఇవ్వడం గానీ చేయకూడదు.
5.  తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు లొంగిపోవల్సి ఉంటుంది. 
6. ఈ నాలుగు వారాల వ్యవధిలో చంద్రబాబు ఏ విధమైన మీడియా లేదా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. 
7. కేవలం ఆసుపత్రి సంబంధిత వ్యవహారాల్లో మాత్రమే పాల్గొనేందుకు వీలుంటుంది. 

Also read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News