COVID-19: ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఏపీలో గత 24 గంటల్లో 61,331 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 10,526 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 4,00,721కి చేరింది.

Last Updated : Aug 28, 2020, 08:00 PM IST
COVID-19: ఏపీలో  4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

అమరావతి : ఏపీలో గత 24 గంటల్లో 61,331 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests ) నిర్వహించగా అందులో 10,526 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 4,00,721కి చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 81 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,714కు చేరింది. గత 24 గంటల్లో 8,463 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా అలా ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,03,711 మందికి చేరింది. Also read : Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4.. ఏం మారనున్నాయి అంటే..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 35,41,321 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

Trending News