COVID-19: 4 వేలకు చేరువలో కరోనా మృతుల సంఖ్య

ఏపీలో గత 24 గంటల్లో 56,490 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 10,004 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 4,34,771 కి చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా 85 మంది చనిపోయారు.

Last Updated : Aug 31, 2020, 07:38 PM IST
COVID-19: 4 వేలకు చేరువలో కరోనా మృతుల సంఖ్య

అమరావతి : ఏపీలో గత 24 గంటల్లో 56,490 మందికి కరోనావైరస్ పరీక్షలు ( COVID-19 tests ) చేయగా అందులో 10,004 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్‌ కేసుల సంఖ్య మొత్తం 4,34,771 కి చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా 85 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,969కి చేరింది. గత 24 గంటల్లో 8,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,30,526 మందికి చేరింది. Read also :  BREAKING: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్ ( COVID-19 AP Health bulletin )‌ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 37,22,912 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 59,403 కరోనా కేసులు నమోదు కాగా 391 మంది కరోనాతో చనిపోయారు. ఇక కరోనా మరణాల సంఖ్య విషయానికొస్తే చిత్తూరు జిల్లాలో నేటివరకు 415 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలోనే కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. Read also : AP Pensions: సెప్టెంబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం

Trending News