Tirumala Temple: శ్రీవారి సన్నిధిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు..తేదీలు ఫిక్స్..!

Tirumala Temple: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తొలిసారి హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 04:28 PM IST
  • టీటీడీ మరో కీలక నిర్ణయం
  • శ్రీవారి సన్నిధిలో తొలిసారి హనుమాన్ జయంతి ఉత్సవాలు
  • ఉత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
Tirumala Temple: శ్రీవారి సన్నిధిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు..తేదీలు ఫిక్స్..!

Tirumala Temple: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తొలిసారి హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

తిరుమలలో తొలిసారి హనుమాన్‌ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 25 నుంచి 29 వరకు వేడుకలు జరుగుతాయి. ఉత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

తిరుమలలోని అంజనాద్రి జాపాలి, నాదనీరాజన వేదిక, వేద పాఠశాలలో హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతాయన్నారు. ఈ నెల 29న ధర్మగిరి వేద పాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఆయా విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాలు తొలిసారి నిర్వహిస్తున్నామని..ఘనంగా జరిపే బాధ్యతను అధికారులు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 

ఉత్సవాలను ఎస్‌వీబీసీ నాలుగు ఛానెళ్ల ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి వాహనాలకు ఎలాంటి చిహ్నాలను ఉంచుకోవద్దని సూచించారు. వ్యక్తిగత ఫోటోలు, పార్టీ జెండాలు, అన్యమత చిహ్నాలు ఉంటే అలిపిరి వద్దే నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈవిధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నామన్నారు. తిరుమల(TIRUMALA) కొండపై నిబంధనలను పక్కాగా పాటిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Also read:Asani Cyclone: అసనీ తుపాను పేరు ఎవరు ఎలా పెట్టారు, అసనీ అంటే అర్ధమేంటి

Also read:Banana Side Effects: అరటిపండ్లు ఎక్కువగా తింటున్నారా... అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News