26 Districts in AP: 26 జిల్లాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర.. ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల అవతరణ

ముందుగా ఉగాదికి రోజున ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు అనుకున్నప్పటీకి, ఇపుడు ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం చేయాలని ముహూర్తం ఖరారు చేసారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 05:39 PM IST
  • మారిన కొత్త జిల్లాల ఏర్పాటు రోజు
  • ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల అవతరణ
  • 26 జిల్లాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
26 Districts in AP: 26 జిల్లాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర.. ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల అవతరణ

26 Districts in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జిల్లాల విభజన కసరత్తు పూర్తైంది. ఇప్పటికే జిల్లాల పేర్లు, హద్దులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం.. తుది నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేస్తోంది. ముందుగా అనుకున్న తేదీ కాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు మరో తేదీకి మారింది. ఉగాదికి అనుకున్నప్పటికీ, ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం చేయాలని ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాలకు జగన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది.  

ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. విభజనతో జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ విజయవాడ జిల్లాలు అమలులోనికి రానున్నాయి. కొత్తగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. 

జిల్లాల విభజనకు జనవరి 26న డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అప్పటినుంచి వేగంగా  కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాల సేకరణ కూడా దాదాపుగా పూర్తయింది. ఉద్యోగుల విభజన కూడా చకచక సాగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పై వచ్చిన అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. 10 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినా… ఇవన్నీ కేవలం 70 నుంచి 80 వరకు అంశాలపైనే ఉన్నాయి. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 90 శాతం యదాతథంగా ఉంటుందని.. కేవలం 10 శాతం మార్పులు కూడా జరిగాయని తెలుస్తోంది. అభ్యంతరాల్లో శ్రీబాలాజీ జిల్లాను తిరుపతిగా ఉంచాలనే అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంది. శ్రీ బాలాజీ జిల్లాను తిరుపతిగా మార్చింది.

Also Read: CM KCR: ఇక వేములవాడపై కేసీఆర్ ఫోకస్... చిన జీయర్‌కు చెక్.. త్వరలో భారతీ తీర్థ స్వామి వద్దకు..

Also Read: Macherla Niyojakavargam Teaser: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News