Macherla Niyojakavargam Teaser: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ వచ్చేసింది!

Macherla Niyojakavargam Teaser: టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. బుధవారం (మార్చి 30) హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ (ఫస్ట్ ఎటాక్) ను చిత్రబృందం విడుదల చేసింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 04:39 PM IST
Macherla Niyojakavargam Teaser: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ వచ్చేసింది!

Macherla Niyojakavargam Teaser: యువ కథానాయకుడు నితిన్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బుధవారం (మార్చి 30) హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ ఎటాక్ పేరుతో ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 

పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌‌గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీలో నితిన్ ఎప్పుడూ లేని విధంగా మీసంతో, సీరియస్ లుక్ లో తెరపై కనువిందు చేయనున్నాడు. ఈ చిత్రంలో నితిన్.. గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. 

ఆ వీడియోలో హీరో నితిన్ గొడ్డలి చేతపట్టి పది మంది పులి వేషగాళ్లను వెంటాడుతున్నట్లు ఉంది. టీజర్ ను బట్టి చూస్తుంటే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుందని తెలుస్తోంది. 

ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని జులై 8న ప్రేక్షకుల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  

Also Read: Sreemukhi Photos: యాంకర్ శ్రీముఖి చీరకట్టులో ఇంత అందంగా ఉందేంటి?

Also Read: Ghani Pre Release Event: గని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News