Vallabhaneni Vamsi: చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరున్నారు

Vallabhaneni Vamsi: పరిటాల సునీత వర్సెస్ వల్లభనేని వంశీ వివాదం ముదురుతోంది. చంద్రబాబు నైజమేంటనేది ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు వల్లభమేని వంశీ. చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబుపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2021, 07:02 AM IST
  • చంద్రబాబు అండ్ కో పై తీవ్ర వ్యాఖ్య.లు చేసిన వల్లభనేని వంశీ
  • పరిటాల రవిపై ఆంధ్రజ్యోతిలో చెడుగా వార్తలు రాయిస్తూ అవమానించలేదా అని ప్రశ్నించిన వంశీ
  • చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరున్నారని ప్రశ్న
Vallabhaneni Vamsi: చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరున్నారు

Vallabhaneni Vamsi: పరిటాల సునీత వర్సెస్ వల్లభనేని వంశీ వివాదం ముదురుతోంది. చంద్రబాబు నైజమేంటనేది ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు వల్లభమేని వంశీ. చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబుపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాయుడు దీక్షలో(Chandrababu Deeksha)గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు దీటైన సమాధానం చెప్పారు వంశీ. ఇప్పటికే రాజీనామా లేఖను పరిటాల సునీతకు(Paritala Sunitha)పంపిస్తానని చెప్పిన వంశీ..ఇంకా పలు కీలకాంశాలపై స్పందించారు. దమ్ముంటే గన్నవరంలో లోకేష్ తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. వాస్తవానికి చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరున్నారని వంశీ ప్రశ్నించారు. నాడు పెద్దాయన ఎన్టీఆర్ పైనే చెప్పులు విసిరించడం, అమిత్ షా కారుపై రాళ్లు విసరడం చంద్రబాబు చేసిందే కదా అని మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu)చేసినన్ని నీచ రాజకీయాలు భారతదేశ చరిత్రలో మరెవ్వరూ చేయలేదని దుయ్యబట్టారు. 

పిచ్చవాగుడు మానుకోకపోతే..లోకేష్‌ను(Nara Lokesh)జీవితాంతం వెంటాడుతామని హెచ్చరించారు వల్లభనేని వంశీ. ప్రపంచంలోని కమ్మోళ్లంతా వచ్చి ప్రచారం చేసి..దమ్ముంటే గన్నవరంలో లోకేష్ పోటీ చేసి తనను ఓడించాలని సవాలు చేశారు. తనపై విమర్శించే ప్రతి మాటకూ అంతే స్థాయిలో జవాబు చెబుతానని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాపుల్ని మోసం చేయడం, ముద్రగడ ఇంటిసభ్యుల్ని రోడ్డుకీడ్చడం చంద్రబాబు చేయలేదా అని ప్రశ్నించారు. ఇక పరిటాల రవిపై(Paritala Ravi)చంద్రబాబు నిరంతరం తప్పుడు ప్రచారమే చేయించాడని విమర్శించారు. ఆంధ్రజ్యోతిలో ప్రతివారం పరిటాల రవిపై వ్యతిరేకంగా వార్తలు రాయించేవారని..రవిని దారుణంగా అవమానించింది బాబేనని స్పష్టం చేశారు. కోడెల పనులకు తమకూ సంబంధం లేదని పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టించి..ఆయన ఆత్మహత్యకు కారణం కాలేదా అని గుర్తు చేశారు. జయప్రదంగా చంద్రబాబు సైకిల్ గుర్తు దక్కించుకోలేదా అని అడిగారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో(Call money Sex Rocket)చంద్రబాబు ఎవరినైనా శిక్షించాడా అని వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)నిలదీశారు. కాల్‌మనీ వ్యాపారులకు పదవులిచ్చిన సంగతి గుర్తు చేశారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించింది చంద్రబాబు కాదా అని మండిపడ్డారు. 

Also read: Vallabhaneni Vamsi : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్, ఇప్పుడే రాజీనామా చేస్తా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News