AP Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మూడ్రోజులు ఏపీలో వర్షాలు

AP Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2022, 03:23 PM IST
AP Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మూడ్రోజులు ఏపీలో వర్షాలు

AP Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులుంటాయని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. 

బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చు. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు పడనున్నాయి. ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ తేలికపాటి వర్షాలు పడనున్నాయి. రేపు మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains), ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక రాయలసీమ ప్రాంతంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు పడనున్నాయి.

Also read: Jagananna Smart Township: మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు, ఇవాళ్టి నుంచి దరఖాస్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News