65 Feet Big Trishul At Vizag Kailasagiri: సముద్ర తీర ప్రాంతంతో పర్యాటకులను ఆకర్షించే విశాఖపట్టణానికి మరో అదనపు ఆకర్షణ వచ్చింది. విశాఖలోని కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటుచేశారు. నగరం నలుమూలలా నుంచి కొండపై అందంగా త్రిశూలం కనిపిస్తోంది. దీనిని స్థానిక విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది.
65 Feet Trishul Set To Become Major Attraction In Vizag: సముద్ర తీర ప్రాంతం విశాఖపట్టణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఏపీలోనే అతిపెద్ద నగరం విశాఖ సిగలో మరో అందం వచ్చేసింది. కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటుచేయడంతో సందర్శకులను కనువిందు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు చూడండి.
AP Heavy Rain Alert: రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో అకాల వర్షాల ధాటికి పంటలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు ప్రభుత్వం సూచనలను అందించింది.
AP Rain Alert News: రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉరుములతో కూడిన వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
AP Rain Alert News: రాబోయే నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉరుములతో కూడిన వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉఫరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
AP Rain Alert: ఓ వైపు చలికి ప్రజలు గజగజ వణుకుతుంటే.. మరోవైపు ఏపీలో వానలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం వాయుగుండంగా బలహీన పడింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టిపుకు సమీపంలో శనివారం సాయంత్రం తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. అయితే ఈ వాయుగుండం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.
AP Weather Alert:సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ . APకి తుపాను ముప్పు లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు లేవని తెలుస్తోంది. అది వాయవ్య దిశగా కదులుతోందన్నారు.
Govt Likely To Announce School And Colleges Holiday A Head Ditwah Cyclone: మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. దిత్వా తుఫాన్ దూసుకొస్తుండడంతో ఏపీలో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో మళ్లీ స్కూళ్లకు సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వివరాలు ఇవే..
Two Days Heavy Rains In These Districts Of Andhra Pradesh: మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. అల్పపీడనం ఏర్పడడంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth reddy on montha cyclone: మొంథా తుపాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకొవాలన్నారు.
Telangana Toofan Effect: మొంథా తుపాను ఎఫెక్ట్ తో తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Telugu States Rain Alert Live: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో ఏపీకి మంతా తుపాను దూసుకువస్తోంది. ఈ యేడాది అత్యంత బలమైన తుపానుగా మారబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగు రోజులు పాటు ఏపీలో భీకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తనున్నాయి.
AP Rains: అల్ప పీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ ను కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయు గుండంగా మారడంతో తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి వరకు ఎండ ఉన్న చోట ఒక్కసారిగా పిడుగుపాటు వర్షాలతో తడిసి ముద్దవుతున్నారు.
School Holidays in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ ని ఈశాన్య ఋతు పవనాలు వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
AP Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అది వాయు గుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains Alert: ఏపీలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా జోరుగా వానలు కురుస్తున్నాయి. గత నెలలో రెండు వాయుగుండాలు ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసింది. వారం రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతుంది. అయితే తాజాగా వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది.
Hyderabad Rains: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
AP Weather Alert: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradsh) మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. వాయివ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తాయని పేర్కొంది.
AP Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత 24 గంటల్లో ఒడిశా మీదుగా ముందుకు కదులుతూ తుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.