తెనాలిలో అభిమానులతో పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాలు

పవన్ కల్యాణ్ తెనాలికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

Last Updated : Jan 13, 2019, 08:33 PM IST
తెనాలిలో అభిమానులతో పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాలు

తెనాలి: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తెనాలిలో పర్యటించారు. పవన్ కల్యాణ్ తెనాలికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ రాకతో తెనాలిలో జనసేన పార్టీ కార్యకర్తల సందడి నెలకొంది. తెనాలిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకే పవన్ కల్యాణ్ అక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. 

Trending News