తెలంగాణ, యువత గురించి పవన్ కల్యాణ్ అభిప్రాయం!

బుధవారం గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated : Mar 15, 2018, 12:47 AM IST
తెలంగాణ, యువత గురించి పవన్ కల్యాణ్ అభిప్రాయం!

తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని జనసేన పార్టీ కోరుకుంటోందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. బుధవారం గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, తెలంగాణలో కొత్త యువనాయకత్వం రావాల్సిన అవసరం వుంది. సరికొత్త యువనాయకత్వాన్ని అసెంబ్లీకి పంపడమే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అంతేకాకుండా అందుకోసం తమతో కలిసొచ్చే పార్టీలతో కలిసి పనిచేయడానికైనా జనసేన సిద్ధం అని పవన్ స్పష్టంచేశారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న యువ శక్తి సరికొత్త నాయకత్వం కోసం ముందుకు రావాలి. అలాగే ఏపీలో కూడా కొత్త నాయకత్వం కావాలి. అందుకే జనసేన పార్టీలో అనుభవజ్ఞుల కన్నా యువతకే అధిక ప్రాధాన్యత ఉంటుందని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. 

Trending News