Visakhapatnam: ప్రేమను నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ తో దాడి..ఆపై...

Crime news: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి కలకలం సృష్టించింది. మాట్లాడేందుకు యువతిని లాడ్జికి తీసుకెళ్లిన యువకుడు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 12:16 PM IST
  • విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
  • యువతిపై పెట్రోల్ తో దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Visakhapatnam: ప్రేమను నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ తో దాడి..ఆపై...

Vishakapatnam Crime news: యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన విశాఖ నగరం(vishakapatnam)లో కలకలం రేపింది. మాట్లాడేందుకు యువతిని  లాడ్జికి తీసుకెళ్లిన యువకుడు ఆమెపై పెట్రోల్‌ పోసి(Petrol Attack) నిప్పంటించాడు. వీరిద్దరూ మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం సృష్టించాయి. హోటల్‌ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్‌(KGH)కు తరలించారు. తెలంగాణ(Telangana)లోని భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌రెడ్డి(21), విశాఖ నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన యువతి(20) పంజాబ్‌లో కలిసి ఇంజినీరింగ్‌ చదువుకున్నారు. 

Also Read: Crime News: ప్రియుడి కోసం కన్నతండ్రినే కడతేర్చిన కూతురు!

ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో దిగాడు. తాను వచ్చిన విషయం చెప్పడంతో ఆ యువతి కూడా వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆగ్రహం చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు...తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. హర్షవర్ధన్‌రెడ్డికి 62శాతం, ఆ యువతికి 61శాతం కాలిన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు(Visakha police) దర్యాప్తు  చేస్తున్నారు.

Also Read: Husband Stabs Wife Boyfriend : భార్య ప్రియుడిని కత్తితో పొడిచిన భర్త 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News