Crime News: ప్రియుడి కోసం కన్నతండ్రినే కడతేర్చిన కూతురు!

Crime News: తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని కన్న తండ్రిని హత్య చేసింది ఓ కూతురు. ప్రియుడితో కలసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాప్రాలో చోటుచేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 03:15 PM IST
  • మేడ్చల్ జిల్లా కాప్రాలో దారుణం
  • ప్రియుడి కోసం తండ్రి హత్య
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Crime News: ప్రియుడి కోసం కన్నతండ్రినే కడతేర్చిన కూతురు!

TS News: ప్రేమ మత్తులో పడి కన్నతండ్రినే హత్య(Murder) చేసింది ఓ కూతురు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాప్రాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జులై 20న కాప్రా(Capra)లో రామకృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యగా పోస్టుమార్టం  రిపోర్టులో తేలింది.  కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మేడ్చల్ జిల్లా*Medchal District) కాప్రాలో భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు రామకృష్ణ. రామకృష్ణ కూతురు నారాయణగూడకు చెందిన భూపాల్‌ను ప్రేమించింది. అయితే వీరి ప్రేమ(Love) వ్యవహారం ఇష్టంలేని తండ్రి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో కొన్ని రోజులు జైలులో గడిపాడు. అనంతరం రామకృష్ణపై అతడు పగ పెంచుకున్నాడు. 

Also Read: Husband Stabs Wife Boyfriend : భార్య ప్రియుడిని కత్తితో పొడిచిన భర్త

రామకృష్ణను చంపేందుకు అతడి కుమార్తెతో కలిసి పథకం పన్నాడు. అతడిని హత్య చేస్తే రూ.2 లక్షలు ఇచ్చేలా మిత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకంలో భాగంగా.. రామకృష్ణ కుమార్తె జులై 19న తండ్రికి ఆహారంలో నిద్రమాత్రలు(Sleeping pills) కలిపి ఇచ్చింది. అనంతరం అతడు నిద్రమత్తులో ఉండగా భూపాల్‌ మిత్రులు అతడిని గొంతు నులిమి కణతిపై కత్తితో పొడిచి పారిపోయారు. అనంతరం జులై 20 రామకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ కేసులో రామకృష్ణ భార్య చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు భూపాల్... ప్రియురాలితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

Also Read: Mahbubnagar: రెండు వారాల్లో పెళ్లి...అంతలోనే యువతిపై లైంగిక దాడి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News