Dussehra Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్స్..

Dasara Festival: దసరా రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 05:56 PM IST
Dussehra Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్స్..

Dussehra Special Trains: దసరా సీజన్‌లో అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే (SCR). సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య స్పెషల్ ట్రైన్స్ ను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు నెం 07489 అక్టోబర్ 21న సికింద్రాబాద్ లో రాత్రి 10:50 గంటలకు బయలుదేరి ఉదయం 9:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెం 07490 అక్టోబర్ 22న తిరుపతిలో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరి ఉదయం 4:50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. 

కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
దసరా పండుగ సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య ప్యాసింజర్స్ ఎక్కువగా ప్రయాణిస్తారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. రద్దీని తగ్గించేందుకు కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 19 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. రైలు నెం. 07653 రాత్రి 9.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. రైలు నెం 07654 సాయంత్రం 5:10 గంటలకు కాకినాడలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. 

Also read: Hemesh Chadalawada: హైదరాబాద్‌ యువకుడికి అరుదైన గుర్తింపు.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా సత్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News