Chandra Grahan 2023 effect: ప్రతి సంవత్సరం శరద్ పూర్ణిమ అశ్వినీ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి మరుసటి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న జరుపుకోనున్నారు. పౌర్ణమి రోజున గంగాస్నానం చేయడం వల్ల పాపాలన్నీ పోతాయని నమ్మకం. శరద్ పూర్ణిమ నాడు సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనుంది. అందువల్ల సుతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. చంద్రగ్రహణం సమయంలో రాహువు ప్రభావం పెరుగుతుంది. ఈ టైంలో 2 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చంద్ర గ్రహణ సమయం
జ్యోతిష్యుల ప్రకారం, శరద్ పూర్ణిమ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 01:06కి ప్రారంభమై 02:22కి ముగుస్తుంది. అదే సమయంలో, పూర్ణిమ తిథి రాత్రి 01:53 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం యొక్క వ్యవధి 1 గంట 16 నిమిషాలు.
మేష రాశి
చంద్రుడు అక్టోబర్ 28వ తేదీ ఉదయం 07:31 గంటలకు మీనం రాశి నుండి బయటకు వెళ్లి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10.28 గంటల వరకు చంద్రుడు అదే రాశిలో ఉంటాడు. గ్రహణ సమయంలో చంద్రుడు మేష రాశిలోని లగ్న గృహంలో ఉంటాడు. దీని వల్ల మేషరాశి వారిని మానసిక సమస్యలు వెంటాడతాయి. మీ మాటలను అదుపులో ఉంచుకోకపోతే చాలా నష్టపోతారు. ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఇతరులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి చంద్రదేవుడు. గ్రహణం సమయంలో కర్కాటక రాశి వారు ఆందోళన చెందే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం మీకు మేలు జరుగుతుంది.
Also Read: Diwali Horoscope: దీపావళికి ముందు ఈ 3 రాశులవారి తల రాతలు మారబోతున్నాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..