Shwetha Death Case: క్షణికావేశం.. భర్తతో గొడవ పడి గర్భిణి ఆత్మహత్య

ఇటీవలే ఆర్కే బీచ్ లో యువతి మృతదేహం అర్థ నగ్నంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కొన్ని గంటల్లోనే కేసు పూర్తీ చేశారు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 01:11 PM IST
Shwetha Death Case: క్షణికావేశం.. భర్తతో గొడవ పడి గర్భిణి ఆత్మహత్య

Shwetha Death Case in Visakhapatnam: మంగళవారం అర్థరాత్రి సమయంలో ఆర్కే బీచ్ లో యువతి మృతదేహం అర్థ నగ్నంగా కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. మొదట పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎవరైనా అఘాయిత్యం చేసి హత్య చేసి సముద్రంలో పడేశారేమో అంటూ కూడా మొదట కొందరు అనుమానించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కొన్ని గంటల్లోనే ఆమె ను గురువెల్లి శ్వేతగా గుర్తించారు. అంతకు కొన్ని గంటల ముందే శ్వేత మిస్సింగ్ కేసు పోర్ట్‌ ఏరియా పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది. ఇసుకలో కూరుకు పోవడం వల్ల డ్రెస్‌ లేకుండా ఆపోయిందని పోలీసులు గుర్తించారు. ఇంకా విషాదకర విషయం ఏటంటే శ్వేత అయిదు నెలల గర్భిణి. భర్త మరియు అత్తామామలతో గొడవ కారణంగానే శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకులం జిల్లా మూలపేటకు చెందిన రమ విశాఖ రైల్వే ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కూతురు శ్వేత. గత ఏడాది గాజువాక సమీపంలో ఒక కాలనీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన గురువిల్లి మణికంఠతో శ్వేత వివాహం జరిగింది. ఇన్నాళ్లు విధులను ఇంట్లో నుండే నిర్వహించిన మణికంఠ ఇటీవల హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ లో పని నిమితం 15 రోజుల క్రితం వెళ్లాడు. అత్తా మామలతో కలిసి 15 రోజులుగా శ్వేత ఉంటుంది. అప్పటి నుండి కూడా శ్వేత మరియు మణికంఠల మధ్య ఫోన్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయట. అత్తా మామల తో ఉండే విషయంలో శ్వేత కు మరియు మణికంఠకు గొడవలు జరుగుతున్నాయి అంటూ స్థానికులు చెబుతున్నారు. 

మంగళవారం సాయంత్రం సమయంలో అత్త మామలతో శ్వేత చాలా సమయం గొడవ పడింది. ఆ తర్వాత కొద్ది సమయానికి శ్వేత అత్త మామలు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండి బయటకు వెళ్లారు. అత్తా మామలు బయటకు వెళ్లిన తర్వాత మణికంఠతో శ్వేత చాలా సమయం ఫోన్ లో మాట్లాడిందట. ఇద్దరి మధ్య గొడవ పెరగంతో శ్వేత ఫోన్‌ కట్‌ చేసి ఆపై స్విచ్చాఫ్‌ చేసిందట. రాత్రి 7.30 గంటల సమయంలో శ్వేత ఇంటికి తాళం వేసి పక్క ఇంట్లో కీ ఇచ్చి బయటకు వెళ్లిందట. అత్త మామ ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా మణికంఠకు శ్వేత రాసిన లేఖ కనిపించింది. దాంతో వెంటనే మణికంఠ తల్లిదండ్రులు పోలీసులకు శ్వేత మిస్ అయ్యింది అంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే శ్వేత మృత దేహం ఆర్కే బీచ్‌ లో తేలింది. 

Also Read: AP Inter Results 2023: గంట ఆలస్యంగా ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. కారణం ఇదే!

శ్వేత ఇంటి నుండి వెళ్లి పోయే ముందు భర్త మణికంఠకు లేఖ రాసింది. ఆ లేఖలో.. నేను లేకుండా నువ్వు బిందాస్ గా ఉంటావు అని నాకు ఎప్పుడో తెలుసు. నీకు ఏమాత్రం బాధ ఉండదు. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్‌ ఫర్ యువర్ ఫ్యూచర్‌ అండ్‌ న్యూ లైఫ్‌.. చాలా మాట్లాడటానికి ఉన్నా కూడా నేను ఏమీ మాట్లాడటం లేదు. నీకు అన్నీ తెలుసు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటూ శ్వేత రాసుకొచ్చింది. 

తన కూతురు మృతిపై రమ కన్నీరు మున్నీరు అయ్యారు. పది లక్షల కట్నం ఇచ్చినా కూడా చాల్లేదంటూ తన కూతురుని అత్తారింటి వారు వేదించారని ఆమె ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. శ్వేత మృతి పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: CM Jagan Mohan Reddy: నరమాంసం తినే పులి ముసలిదైపోయింది.. చంద్రబాబుపై సీఎం జగన్ ఓ రేంజ్‌లో కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News