AP Inter Results 2023: గంట ఆలస్యంగా ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. కారణం ఇదే!

AP Inter Results 2023 to be released One hour late by at 6 pm Today. సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. ఓ గంట ఆలస్యంగా సాయంత్రం 6 గంటలకు వెలుబడనున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 26, 2023, 06:31 PM IST
AP Inter Results 2023: గంట ఆలస్యంగా ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. కారణం ఇదే!

AP Inter Results to be released One hour late by at 6 pm Today: ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు గంట ఆలస్యంగా విడుదల కానున్నాయి. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలస్యంగా విజయవాడకు చేరుకోనున్నారు. సీఎం వైఎస్ జగన్‌తో పాటు కలిసి వస్తున్న బొత్స సత్యనారాయణ  గంట ఆలస్యంగా విజయవాడ చేరుకుంటారు. దాంతో సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. ఓ గంట ఆలస్యంగా సాయంత్రం 6 గంటలకు వెలుబడనున్నాయి. 

షెడ్యూల్‌ ప్రకారం విజయవాడలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయాలి. నేడు అనంతపురం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం జగన్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా మంత్రి బొత్స విజయవాడ చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో 5 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్ ఫలితాలు గంట ఆలస్యంగా.. 6 గంటలకు విడుదల కానున్నాయి. 

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు సాయత్రం 6 గంటలకు విడుదల కానున్నాయని ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలనూ ఈరోజే వెల్లడిస్తారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది.. వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.  

Also Read: Tata Nexon Price 2023: బెస్ట్ సెల్లింగ్ కారు టాటా నెక్సాన్‌ను కేవలం 1.5 లక్షలకే ఇంటికి తీసుకుకెళ్లండి!  

Also Read: Virat Kohli IPL Ban: విరాట్‌ కోహ్లీ మెడ మీద వేలాడుతున్న కత్తి.. ఐపీఎల్ బ్యాన్ తప్పదా?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News