YS Sharmila: అన్నపై పోటీకి వైఎస్ షర్మిల సై.. ఆ రెండు స్థానాల నుంచి బరిలోకి..!

CM Jagan Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో చతికిలబడిన కాంగ్రెస్‌కు మళ్లీ జీవం పోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వైఎస్‌ షర్మిల. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే దూకుడు పెంచుతున్నారు. నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్న షర్మిల కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చేందుకు రెండు స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 23, 2024, 07:58 PM IST
YS Sharmila: అన్నపై పోటీకి వైఎస్ షర్మిల సై.. ఆ రెండు స్థానాల నుంచి బరిలోకి..!

CM Jagan Vs YS Sharmila: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. హస్తం పార్టీలో పునరుత్తేజం తెచ్చేలా ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. స్థానిక నేతలను కలిసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశ నిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో తాను పోటీ చేసే నియోజక వర్గాలపై షర్మిల ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సొంతగడ్డ అయిన రాయలసీమతో పాటు మరో చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపర్చాలన్నది షర్మిల వ్యూహంగా తెలుస్తోంది. దీంతో షర్మిల తాను పోటీకి పరిశీలిస్తున్న సీట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు తన తండ్రి, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటు కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన బాబాయ్ వివేకానందరెడ్డి కుమార్తె, తన సోదరి సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే యోచనలో షర్మిల ఉంది. పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలోని రెండు స్థానాల్లో ఒక సీటును షర్మిల ఎంచుకునే అవకాశం ఉంది. విజయవాడ తూర్పుతో పాటు గుంటూరు పశ్చిమ సీట్లలో పోటీ చేయడంపై షర్మిల పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. గతంలో ఇక్కడ ఆరేసి సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మారిన పరిస్థితుల్లో గత దశాబ్దకాలంగా ఈ స్థానాల్లో వేరే పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారు అయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి షర్మిల అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ క్యాడర్ కాంగ్రెస్ లోకి వస్తుందని భావిస్తున్నారు. దాంతో షర్మిల గెలుపు సునాయసం అవుతుందని లెక్కలు కడుతున్నారు.

మరోవైపు షర్మిల విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే ప్రకటించిన వైసీపీ ఇన్‌ఛార్జ్‌లను మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ తూర్పునకు దేవినేని అవినాష్, గుంటూరు పశ్చిమకు విడదల రజనీలు ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతున్నారు. వీరిని మరో చోటుకు మార్చే అవకాశం ఉంది. అయితే షర్మిల పోటీపై క్లారిటీ వచ్చాకే జగన్ ఈ సీట్లలో మార్పులు చేయాలా వద్దా అన్నది నిర్ణయించనున్నారు. మొత్తమ్మీద ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా చేసేందుకు షర్మిల గట్టి వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు.

Also Read: Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు

Also Read Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News