Ysr congress party vote share: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి ప్రజాబలాన్ని నిరూపించుకుంది. భారీ మెజార్టీతో సాధించిన విజయంతో రికార్డు సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు చెక్కచెదరలేదు సరికదా..ఇంకా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నిక (AP Municipal Elections) ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీ, నగర పంచాయితీల్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే సరికొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ ఏ పార్టీకి లేనంత భారీ విజయాన్ని అందుకుంది. మొత్తం మున్సిపాలిటీలు , కార్పొరేషన్లను వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అన్నింటికీ మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు చెక్కుచెదరలేదని నిరూపితమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే..ఓటు షేరు ఇంకాస్త పెంచుకుంది. అంటే అప్పట్నించి ఇప్పటికి ప్రజాబలం మరింతగా పెరిగింది.
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ 52.63 శాతం కాగా, తెలుగుదేశం పార్టీ(Telugu Desam party)కు 30.73 శాతం ఓటు షేరు దక్కింది. బీజేపీకు 2.41 శాతం రాగా, జనసేన 4.67 శాతానికి పరిమితమైంది. ఇక సీపీఐకు 0.80 శాతం, సీపీఎంకు 0.81 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం కమ్యూనిస్టుల కంటే దారుణంగా పడిపోయింది. ఆ పార్టీ కేవలం 0.62 శాతం ఓట్లు సాధించింది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఓటు షేర్ గణనీయంగా దాదాపు 9 శాతం వరకూ తగ్గిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా 3 శాతం పెంచుకుంది. ఫ్యాన్ గాలికి 97.33 శాతం మున్సిపాలిటీల్లో వైసీపీ పాగా వేయగలిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు, నవరత్నాలు, పరిపాలనా రాజధాని అంశాలకు ప్రజామోదం గట్టిగా విన్పించింది.
2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 939 వార్డుల్లో విజయం సాధించి..36.52 శాతం వార్డుల్ని దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1424 వార్డుల్లో గెలిచి..55.39 శాతం వార్డుల్ని దక్కించుకుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( Ysr congress party) 2 వేల 265 వార్డుల్ని గెల్చుకోవడం ద్వారా 81 శాతం సాధించింది. తెలుగుదేశం పార్టీ విజయశాతం గత ఎన్నికలతో పోలిస్తే 12 శాతానికి పడిపోయింది.
Also read: AP Roads: రాష్ట్రంలో భారీ ఎత్తున రోడ్డు మరమ్మత్తు పనులకు టెండర్ నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook