AP: కరోనా బారిన తిరుపతి ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.

Last Updated : Aug 26, 2020, 12:43 PM IST
AP: కరోనా బారిన తిరుపతి ఎమ్మెల్యే

Bhumana Karunakar Reddy tested Covid-19: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుప‌తి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ( Bhumana Karunakar Reddy) కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అంతకుముందు ఆయన కుమారుడు అభినయ రెడ్డి కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరారు. కరోనా సోకడంతో భూమన చికిత్స నిమిత్తం ఆయన తిరుప‌తిలోని రుయా ఆసుపత్రిలో చేరారు. అయితే.. త‌న‌ను క‌లిసిన అధికారులు, నేతలు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని.. ఐసోలేషన్‌లో ఉండాల‌ని ఆయన సూచించారు. Also raed: JEE-NEET Exams: ఆ తేదీల్లోనే పరీక్షలు.. గైడ్‌లైన్స్ విడుదల

ఇదిలాఉంటే.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి ఇప్పటికే కోలుకోగా.. మరికొంతమంది చికిత్సపొందుతున్నారు. ఇటీవల విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh), న‌ర్సారావుపేట ఎమ్మ‌ల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు.

Also read: Disha Patani: అందాలతో కనులవిందు చేస్తున్న దిశా పటానీ

Trending News