DA Hike Updates: 4 శాతం పెరిగిన డీఏ, మే నెలజీతంతో 5 నెలల ఎరియర్లు కూడా

DA Hike Updates: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో 42 శాతం డీఏతో  మే నెల జీతం భారీగా ముట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2023, 02:32 PM IST
DA Hike Updates: 4 శాతం పెరిగిన డీఏ, మే నెలజీతంతో 5 నెలల ఎరియర్లు కూడా

DA Hike Updates: కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డీఏ పెంచుతూ ఉద్యోగులకు మేలు చేకూరుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను ఏకంగా 4 శాతం పెంచడం ద్వారా మొత్తం డీఏ 42 శాతానికి చేర్చింది. మే నెల జీతం భారీగా ఖాతాల్లో పడనుంది. 

ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ లేదా డీఏ లేదా కరవు భత్యాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏకంగా 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 4 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 3 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డీఏ 38 శాతం ఉండగా ఇప్పుడు 4 శాతం పెంపుతో 42 శాతానికి చేరనుంది. ఇది దాదాపు కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకూ ఇచ్చిన డీఏకు సమానం. 

ఏడాది డీఏ మొత్తం 90 వేల రూపాయలు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింహ్ ధామీ డీఏ పెంపును ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపుకు అనుమతిచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతం కాగా తాజాగా 4 శాతం పెంపుతో 42 శాతానికి చేరుకుంటుంది. ఈ మార్పు అనంతరం 18 వేల రూపాయల కనీస వేతనం ఉన్నవారికి ఏడాదికి కరవు భత్యం 90, 720 రూపాయలు అవుతాయి. 18 వేల కనీస వేతనం ఉన్న ఉద్యోగుల సంఖ్య 6,840 కాగా అందరికీ ప్రతి నెలా డీఏ లభిస్తోంది. 

డీఏ ఎంత పెరిగిందంటే

ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెరిగిన తరువాత ఆ మొత్తం 7,560 రూపాయలైంది. అంటే ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కనీస వేతనం 18 వేల రూపాయలు నెలకు ఉంటే పెరిగిన డీఏ 42 శాతం ప్రకారం నెలకు 7560 రూపాయలు అదనంగా జీతంతో వస్తాయి. ఈ కొత్త డీఏ చెల్లింపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు కానుంది. అంటే మే నెల జీతంతో ఐదు నెలల డీఏ ఒకేసారి అందుకోనున్నారు. 

ఏడాదిలో రెండుసార్లు పెరగనున్న డీఏ

7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యగుల డీఏ పెంపు ఏడాదిలో రెండు  పర్యాయాలు ఉంటుంది. ఈ వేతన సంఘం ఆధారంగానే కేంద్ర ప్రబుత్వ ఉద్యోగులకు జనవరి నుంచి పెంచాల్సిన డీఏను మార్చ్ నెలలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తదుపరి డీఏ పెంపు జూలై 1 నుంచి అమలు కావల్సి ఉంటుంది. అంటే ఏడాదిలో రెండవ పర్యాయం చేసే డీఏ పెంపుపై సెప్టెంబర్ నెలలో నిర్ణయం తీసుకోవచ్చు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంచడం ద్వారా 42 నుంచి 46కు చేరవచ్చు.

Also read: RBI New Rules: ఇవాళ్టి నుంచే 2 వేల నోట్ల మార్పిడి, ఒకేసారి ఎంత డిపాజిట్ చేయవచ్చు, లిమిట్ ఉందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News