RBI New Rules: ఇవాళ్టి నుంచే 2 వేల నోట్ల మార్పిడి, ఒకేసారి ఎంత డిపాజిట్ చేయవచ్చు, లిమిట్ ఉందా

RBI New Rules: దేశం నెత్తిపై మరోసారి డీమోనిటైజేషన్ పడింది. 2000 నోటును రద్దు చేస్తూ ప్రకటన చేసిన ఆర్బీఐ రద్దైన నోట్లను మార్చుకునేందుకు కొన్ని నియమ నిబంధనలు జారీ చేసింది. అయితే ఒక్కొక్కరు ఎంత పరిమితికి లోబడి 2 వేల నోట్లను మార్చుకోవచ్చు, ఇతర కండీషన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2023, 01:41 PM IST
RBI New Rules: ఇవాళ్టి నుంచే 2 వేల నోట్ల మార్పిడి, ఒకేసారి ఎంత డిపాజిట్ చేయవచ్చు, లిమిట్ ఉందా

RBI New Rules: 2016 నవంబర్ నెల తరువాత దాదాపు ఆరున్నరేళ్ళకు మరోసారి డీమానిటైజేషన్ విధించింది ప్రభుత్వం. 2016లో వేయి రూపాయల నోటు స్థానంలో ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటును రద్దు చేస్తూ ఆర్బీఐ చేసిన ప్రకటన దేశంలో కలకలం రేపింది. అదే సమయంలో ఎవరు ఎంతవరకూ ఎలా మార్చుకోవచ్చో సూచనలు జారీ చేసింది. 

ఆర్బీఐ తాజాగా 2000 రూపాయల నోటును చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న 2 వేల రూపాయల నోటును మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువిచ్చింది. దాదాపు నాలుగు నెలలకు పైగా సమయమిచ్చింది. ఎవరు ఎంతవరకూ ఎలా మార్చుకోవచ్చనే విధి విధానాలు కూడా జారీ చేసింది ఆర్బీఐ. దేశ ప్రజానీకం తమ వద్ద ఉన్న 2 వేల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునే ప్రక్రియ ఇవాళ్టి నుంచి అంటే మే 23 నుంచి ప్రారంభమైంది. ఒక వ్యక్తికి రోజుకు 20 వేల రూపాయల వరకూ 2 వేల నోట్లను అంటే ఒక్కో వ్యక్తి ఒక్కొక్క రోజుకు పది నోట్లను మార్చుకోవచ్చు. 

2023 మే 19వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా సరే తన ఎక్కౌంట్లోకి 2 వేల రూపాయల నోట్లను జమ చేసుకోవచ్చు. నోట్లను జమ చేసేందుకు ఇప్పటికే ఉన్న పాత నిబంధనే దీనికి కూడా వర్తిస్తుంది. అంటే డిపాజిట్ చేసేందుకు పరిమితి లేదు. ఎంత మొత్తమైనా సరే ఎక్కౌంట్‌లోకి డిపాజిట్ చేసుకోవచ్చు. 

ఇవాళ్టి నుంచే నోట్లు మార్చుకునే ప్రక్రియ 

2 వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు లిమిట్ లేదని ఆర్బీఐ తెలిపింది. కేవైసీ పూర్తి కాకపోతే మాత్రం 2 వేల రూపాయల నోట్లు జమ చేయడంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం మే 23 అంటే ఇవాళ్టి నుంచే నోట్లు మార్చుకునే ప్రక్రియ దేశంలో ప్రారంభమౌతుంది. 20 వేల కంటె ఎక్కువ డబ్బులు కావల్సినప్పుడు ముందుగా 2 వేల రూపాయలను తన ఎక్కౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాలి. ఆ తరువాత బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి ఎంత కావాలంటే అంత విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరిచ్చే 2 వేల నోట్లను ఏ బ్యాంకు కూడా నిరాకరించజాలదు. 

రోజుకు 20 వేల చొప్పున సెప్టెంబర్ 30 లోగా ఒక్కో వ్యక్తి 20 లక్షల రూపాయల వరకూ మార్చుకునేందుకు అవకాశముంటుంది. కానీ ఇంత డబ్బుపై లెక్క కూడా చూపించాల్సి వస్తుంది. సెప్టెంబర్ 30 వరకూ దేశంలోని ఏ బ్యాంకుకైనా వెళ్లి 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవడం లేదా మీ ఎక్కౌంట్‌లో జమ చేసుకోవడం చేయవచ్చు. సెప్టెంబర్ 30 దాటితే మాత్రం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సిందే.

Also read: RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News