Airtel unlimited prepaid plans: ఎయిర్‌టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్

Airtel unlimited prepaid plans latest news: ఎయిర్‌టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్‌టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్‌లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. రూ. 99 అన్‌‌లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్‌లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్‌లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

Last Updated : Apr 1, 2021, 04:37 PM IST
  • అధిక ఆధరణ లభించిన ప్రీపెయిడ్ రీచార్జ్ కార్డును రద్దు చేసిన Airtel.
  • ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రమే అవసరం అయ్యే వారికి ఎంతో ఉపయోగపడిన రీచార్జ్ ప్లాన్.
  • Airtel prepaid recharge cards లో ఎక్కువ మందికి ఉపయోగపడే అన్‌లిమిటెడ్ రీచార్జ్ కార్డ్స్ ఏంటి ?
Airtel unlimited prepaid plans: ఎయిర్‌టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్

Airtel unlimited prepaid plans latest news: ఎయిర్‌టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్‌టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్‌లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. మొదట్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ టెలికాం సర్కిల్స్‌లోనే ఉన్న ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌కి భారీ ఆధరణ లభించడంతో ఆ తర్వాత దీనిని బీహార్, జార్ఖండ్, ఒడిషా సర్కిల్స్‌కి సైతం విస్తరించింది. 

రూ. 99 అన్‌‌లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్‌లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్‌లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ డేటాతో ఎక్కువ అవసరం లేకుండా కేవలం అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రమే అవసరం అయ్యే వారికి రూ.99 రీచార్డ్ కార్డు ఎంతో ఉపయోగపడేది. 

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.99 | Airtel prepaid RC 99:
రూ.99 అన్‌లిమిటెడ్ ప్లాన్ ఉన్నప్పుడు 99 రూపాయలకే 18 రోజుల వ్యాలిడిటీతో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్ చేసుకునే వీలు ఉండేది. అంతేకాకుండా నెలకు 1GB డేటా, రోజుకు 100 SMS ప్యాక్‌తో పాటు Airtel Xstream, Wynk Music, Zee5 Premium ని ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఎయిర్‌టెల్ అవకాశం కల్పించింది.

Also read : Cheap and best smartphones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

ఎయిర్‌టెల్ రూ.129 రీచార్జ్ ప్లాన్‌ ప్రయోజనాలు | Benefits of Airtel Rs 129 prepaid plan:
ఎయిర్‌టెల్ రూ.129 రీచార్జ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 24 రోజులు కాగా రోజుకు 1GB ఇంటర్నెట్ డేటా అందిస్తోంది. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్ సౌకర్యంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, వింక్ మ్యూజిక్, జీ5 ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకునే వీలుంది.

ఎయిర్‌టెల్ రూ.199 రీచార్జ్ ప్లాన్‌ ప్రయోజనాలు | Benefits of Airtel Rs 199 prepaid plan:
ఎయిర్‌టెల్ రూ.199 రీచార్జ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులు కాగా రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఆఫర్‌గా అందిస్తోంది. ఇవి కాకుండా వింక్ మ్యూజిక్, ఫ్రీ హెలో ట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మీ మొబైల్‌పై నెల రోజుల పాటు ట్రయల్ Prime video free subscription పొందవచ్చు. ఇతర నెట్‌వర్క్‌కి చెందిన ప్రీపెయిడ్ ప్లాన్స్ కంపారిజన్ కోసం చదవండి Cheapest Data Plans.

Also read : AC Prices, offers: ఈ సమ్మర్‌లో ఏసీ కొనాలనుకుంటున్నారా ? ఐతే మీకు ఈ విషయం తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News