Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్

Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.

Written by - Pavan | Last Updated : Aug 28, 2023, 05:36 PM IST
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్

Cars Launching In September 2023: పండుగల సీజన్‌‌లో కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అలా కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్న వాళ్లందరికీ ఓ గుడ్ న్యూస్. ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు. ఇందులో కొన్ని కొత్తగా లాంచ్ అవుతున్న కార్లు కాగా.. ఇంకొన్ని అప్‌డేటెడ్ వెర్షన్ కార్లు లాంచ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా ఎలివేట్
ఇప్పటికే మార్కెట్లో ఉన్న SUV కార్లకు పోటీగా లాంచ్ అవుతున్న కొత్త కారు పేరే ఈ హోండా ఎలివేట్. ఎస్‌యూవీ లవర్స్‌ని లక్ష్యంగా చేసుకుని లాంచ్ అవుతున్న ఈ హోండా ఎలివేట్ కారు ఈ ఏడాది ఆరంభంలోనే ఆవిష్కరించినప్పటికీ.. అది ఈ సెప్టెంబర్‌లోనే అందుబాటులోకి రానుంది. ఇండియాలో ఎస్‌యూవీ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ వితారా, కియా సెల్టోస్, ఎంజీ ఆస్టర్ వంటి కార్ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ హోండా కంపెనీ ఈ కారును తీసుకొస్తోంది. 

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కార్లలో టాటా నెక్సాన్ ఒకటి అనే విషయం తెలిసిందే. తమ దూకుడును అలాగే కొనసాగించే బిజినెస్ ప్లాన్స్‌లో భాగంగా టాటా మోటార్స్ ఈ సెప్టెంబర్ నెలలో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ వేరియంట్ కారును లాంచ్ చేస్తోంది. ఫేస్‌లిఫ్ట్‌ వేరియంట్‌లో డిజైన్‌లో మార్పులు, కొత్త ఫీచర్స్ జోడించి ఈ కారును ఆవిష్కరిస్తున్నారు. కారులో బిగ్ సైజ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రయాణికుల సౌకర్యార్దం ఏసీ వెంట్స్‌లో సవరణలు వంటి అప్‌డేట్స్ ప్రధానంగా కనిపించనున్నాయి. పాత వెర్షన్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్‌ను అలాగే కొనసాగిస్తున్నారు.

టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్
ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా కనిపించే అత్యధిక మోడల్స్‌లో ముందు వరసలో ఉండే టాటా నెక్సాన్ EV కారు ఫేస్‌లిఫ్ట్‌ వేరియంట్ లాంచ్ అవుతోంది. ఈ ఎలక్ట్రిక్ SUV వాహనంలోనూ కొత్త ఫీచర్స్ యాడ్ కానున్నాయని తెలుస్తోంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పవర్‌ట్రెయిన్ విషయంలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. 

టయోటా రూమియన్ SUV కారు
ఫుల్ పాపులర్ అయిన మారుతి సుజుకి ఎర్టిగాకు టయోటా రూమియన్ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా లాంచ్ అవుతోంది. మారుతి సుజుకి ఎర్టిగా ఇండియాలో ఇప్పటికే సక్సెస్‌ఫుల్ MPV 7-సీటర్ కారుగా పేరు సొంతం చేసుకుంది. టయోటా రూమియన్ డిజైన్‌ విషయంలో అనేక మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ... మెకానిజం పరంగా కారు మారుతి సుజుకి ఎర్టిగా తరహాలోనే ఉంటుందని భావిస్తున్నారు. కాకపోతే టయోటా బ్రాండ్ వ్యాల్యూ కారణంగా మారుతి సుజుకి ఎర్టిగాతో పోలిస్తే టయోటా రూమియన్ కారు ధర ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : Compact SUVs Under 10 Lakhs: రూ. 10 లక్షల్లోపు ఇండియాలో లభించే కాంపాక్ట్ SUV కార్లు

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్
ఈ సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతున్న మరో కారు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్. ఫ్రెంచ్ వాహన తయారీదారు నుండి ఇండియాలో లాంచ్ అవుతున్న కార్లలో ఇది 4వ మోడల్ కాగా.. ఇండియాలో C3 పేరును వస్తోన్న 3వ మోడల్ కారు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ వితారా, టయోటా అర్బన్ క్రూయిజర్, హోండా ఎలివేట్ వంటి మోడల్ కార్లతో సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇందులో 5 లేదా 5+2 సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉండనుంది అని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Honda Elevate vs Hyundai Creta: క్రెటా పని అయిపోయినట్లేనా ? లాంచ్‌ కాకముందే కొత్త SUV కి భారీ సంఖ్యలో బుకింగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News